చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య(Chandu Mondeti, Sai Pallavi, Naga Chaitanya) కలిసి నటించిన తాజా చిత్రం తండేల్(Tandel).ఈ సినిమా నేడు విడుదల అయింది.
సినిమా విడుదలకు ముందు మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే.ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు చాలా విషయాలను పంచుకున్నారు హీరోయిన్ సాయి పల్లవి(Sai pallavi).
ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఇంతకీ అభిమానులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు సాయి పల్లవి ఎలాంటి సమాధానాలు ఇచ్చింది అన్న విషయానికి వస్తే.నటన కాకుండా మీకు ఇంకేది అంటే ఫ్యాషన్ అని అడగగా.తేనెటీగల పెంపకం అంటే చాలా ఇష్టం ఇటీవలే మొదలు పెట్టాను అని తెలిపింది సాయి పల్లవి.
మీరు దర్శకత్వం చేయాలనుకుంటున్నారా అని అడగగా చేయను అలాంటి ఆలోచన లేదు అని తెలిపింది సాయి పల్లవి.ఏదైనా ఫిక్షనల్ క్యారెక్టర్‌తో డిన్నర్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు అని అడగగా.
ఒక్కరితో కాదు.సింప్సన్స్ కుటుంబంతో చేయాలనుంది అని తెలిపింది.
ఖాళీ సమయంలో ఏం చేస్తారు ? అని అడగగా.

నేను నాలా ఉండడానికి ప్రయత్నిస్తాను సినిమాలు చూస్తాను వంట చేయాలనుకుంటాను కానీ చేయలేను ఆర్డర్ పెట్టి తినేస్తాను తోట పని చేస్తాను క్యారెట్లు పండిస్తాను అని చెప్పుకొచ్చింది.అబ్బాయిలు ఎలాంటి డ్రెస్‌లు వాడితే నచ్చుతారు! అని ప్రశ్నించగా.నాకు తెలియదు.
నలిగిపోయిన బట్టలు వేసుకుంటే నాకు నచ్చదు.నా ఫ్యామిలీలో ఎవరైనా అలా కనపడితే, వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.
ఈ సందర్భంగా సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







