రోజు ఉదయం ఈ పాలు తాగితే మలబద్ధకం నుంచి కీళ్ల నొప్పుల వరకు జబ్బులన్నీ పరార్!

పాలు సంపూర్ణ పోషకాహారం అని మనందరికీ తెలుసు.రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

 Garlic Milk Helps To Get Rid Of All The Diseases From Constipation To Joint Pain-TeluguStop.com

అయితే పాలు డైరెక్ట్ గా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.అందుకోసం ముందుగా నాలుగు వెల్లుల్లి రెబ్బలను( Garlic ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ పాలు,( Milk ) కొద్దిగా వాటర్ పోసుకోవాలి.

Telugu Garlic, Garlic Milk, Garlicmilk, Tips, Heart Diseases, Honey, Latest, Mig

పాలు హిట్ అయ్యాక అందులో తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుని మరిగించాలి.దాదాపు ఐదు నుంచి ఆరు నిమిషాలు మరిగించిన అనంతరం పాలను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని రుచికి సరిపడా తేనె( Honey ) కలిపి సేవించండి.ఈ వెల్లుల్లి పాలు అనేక వ్యాధులకు చెక్ పెడ‌తాయి.

రోజు ఉదయం ఒక గ్లాసు వెల్లుల్లి పాలు( Garlic Milk ) తాగడం వల్ల అంతులేని లాభాలు మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా వెల్లుల్లి పాలలో కాల్షియం జింక్ వంటి పోషకాలతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

ఇవి ఎముకలు కండరాలను బలోపేతం చేస్తాయి.కీళ్ల నొప్పులను తరిమి కొడతాయి.

Telugu Garlic, Garlic Milk, Garlicmilk, Tips, Heart Diseases, Honey, Latest, Mig

అలాగే మలబద్ధకంతో( Constipation ) బాధ పడుతున్న వారు రోజు ఉదయం లేదా నైట్ నిద్రించే ముందు ఒక గ్లాస్ వెల్లుల్లి పాలు తాగితే ఆ సమస్య నుంచి సులభంగా బయటపడతారు.వెల్లుల్లి పాలు అధిక కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి.రక్తపోటును అదుపులో ఉంచుతాయి.దాంతో గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.డెలివరీ తర్వాత మహిళలు రోజు వెల్లుల్లి పాలు తాగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.

అంతేకాదు డైట్ లో వెల్లుల్లి పాలును చేర్చుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మెదడు చురుగ్గా పనిచేస్తుంది.మైగ్రేన్ సమస్య ఉంటే దూరం అవుతుంది.

స్కిన్ ఏజింగ్ ఆలస్యం అవుతుంది.గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.

మరియు జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు సైతం దూరంగా ఉండవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube