తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోలు ఎంత మంది ఉన్నప్పటికీ కొందరు హీరోలు మాత్రం తనదైన ముద్ర వేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సాధించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు, అలాంటి వారిలో ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారు ఉండగా తర్వాత జనరేషన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు.తనదైన నటనతో మంచి గుర్తింపు సాధించి జనాలకి కావాల్సిన సినిమాలను అందిస్తూ ఫుల్ గా వాళ్ళని ఆనందింపచేశారు.
ప్రస్తుతం ఉన్న జనరేషన్ హీరోల్లో నందమూరి నట వారసుడు అయిన ఎన్టీఆర్ తన నటనతో అందరిని అలరిస్తూ మాస్ హీరోగా గుర్తింపు పొంది మంచి నటుడిగా ముందుకు సాగుతున్నాడు.
ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి అగ్రహీరోగా ఎదిగాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు హిట్స్ లేకపోయిన రాజమౌళి తీసిన యమదొంగ సినిమాతో మళ్లీ హిట్ బాట పట్టాడు.
ఆ తర్వాత వరుసగా వచ్చిన అదుర్స్, బృందావనం లాంటి సినిమాలు తన నటనా ప్రతిభను బయటికి తీశాయి.పూరి జగన్నాథ్ తీసిన టెంపర్ సినిమాతో తనలోని విలక్షణ నటనను బయటకు తీసి నెగెటివ్ రోల్ లో కూడా చాలా బాగా నటించి శభాష్ అనిపించుకున్నారు.
అలాగే సుకుమార్ దర్శకత్వంలో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా లో కూడా తండ్రి కోసం కొడుకు పడే వేదన ఎలా ఉంటుంది అనేది మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.జనతా గ్యారేజ్ సినిమాలో పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఒక సామాజిక బాధ్యత ఉన్న హీరోగా నటించి మెప్పించారు.
ఆ తర్వాత బాబి దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ సినిమాలో త్రీ పాత్ర అభినయం చేసి ఈ తరం హీరోల్లో ఎవరు చేయలేని విధంగా మూడు పాత్రల్లో తనదైన నటన ప్రతిభని కనబరుస్తూ ముందుకు దూసుకెళ్లాడు.
ఆ తర్వాత మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమాలో రెండు వర్గాల మధ్య గొడవలు ఆపె వ్యక్తిగా వయసుకు మించిన క్యారెక్టర్ లో ఒదిగి పోయి నటించాడు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న త్రిబుల్ ఆర్ సినిమా లో ఒక హీరోగా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అయినను పోయిరావలె హస్తినకు అనే సినిమాకి కమిట్ అయ్యారు.
అలాగే ఈ సినిమా తర్వాత కే జి ఎఫ్ దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు.అయితే ఇది ఇలా ఉంటే అతని వ్యక్తిగత జీవితంలోకి వెళితే లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ప్రస్తుతం వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే లక్ష్మీ ప్రణతి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు కూతురు దాంతో ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి మనవరాలు వరస అవుతుంది.లక్ష్మి ప్రణతి వాళ్ళ నాన్నగారు స్టూడియో ఎన్ అధినేత అయిన నార్ని శ్రీనివాసరావు అయితే లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ గారికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు లక్ష్మీ ప్రణతి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది.అప్పటికి ఇంకా ఆమె మేజర్ కాలేదు దాంతో మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని ఎన్టీఆర్ ఆమెకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు పెద్దబ్బాయి పేరు అభిరామ్ చిన్నబ్బాయి పేరు భార్గవ్ రామ్.
లక్ష్మీ ప్రణతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వలన ఇంటర్మీడియట్ తోనే చదువు ఆగిపోయింది తర్వాత చదువుకోవాలని ఆవిడకు ఉన్న చదువుకోలేకపోయింది.దాంతో ఇంట్లోనే ఉంటూ పిల్లల బాగోగులు చూసుకుంటూ భర్త సినిమాకు సంబంధించిన విషయాల్లో సహాయం చేస్తూ ఉంటుంది.
ఎన్టీఆర్ మాత్రం లక్ష్మీప్రణతిని ఇంట్లో ముద్దుగా లక్కీ అని పిలుస్తూ ఉంటారు అని అంటుంటారు.