ఊపిరితిత్తులు (లంగ్స్)శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఇది ఒకటి.అందుకే లంగ్స్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు.
కానీ, నేటి కాలంలో చాలా మంది లంగ్ క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్, లంగ్స్ డ్యామేజ్ ఇలా ఊపిరితిత్తులకు సంబంధించి అనేక జబ్బులతో బాధ పడుతున్నారు.ఊరిపితిత్తుల వ్యాధులు రావడానికి కేవలం ధూమపానం మాత్రమే కాదు.
కాలుష్యం, ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి ఇలా అనేక కారణాలు కూడా ఉన్నాయి.
అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్‌ను మీ డైట్‌లో గనుక చేర్చుకుంటే లంగ్స్ క్లీన్ అవ్వడమే కాదు హెల్తీగా కూడా మారతాయి.
మరి లేట్ చేయకుండా ఈ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఊపిరితిత్తులను శుభ్ర పరచడంతో అల్లం నీరు అద్భుతంగా సహాయపడుతుంది.వాటర్‌లో క్రస్ చేసిన అల్లాన్ని బాగా మరిగించి, వడబోసి అందులో పుట్ట తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి.ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల లంగ్స్‌లో ఉండే మలినాలన్నీ బయటకు పోయి క్లీన్‌గా మారతాయి.
అలాగే పుదీనా కూడా ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తుంది.పుదీనా జ్యూస్ తీసుకోవడం లేదా పుదీనాను వాటర్‌లో వేసి మరిగించి తీసుకోవడం చేయాలి.ఇలా చేస్తే పుదీనాలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఊపిరితిత్తుల కణజాల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.ఇక ఇన్ఫెక్షన్‌ను నివారించి లంగ్‌ను శుభ్ర పరిచడంలో గ్రీన్ టీ కూడా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.
కాబట్టి, గ్రీన్ టీని డైట్‌లో చేర్చుకోండి.
తులసిలో యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి.అందువల్ల, వాటరల్ తులసి ఆకులను మరిగించి వడబోసి తీసుకోవాలి.ఇలా చేస్తే లంగ్స్‌లో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోయి.
శుభ్రంగా, ఆరోగ్యంగా మారతాయి.ఇక హనీ వాటర్ కూడా లంగ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.
స్వచ్ఛమైన తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు తీసుకుంటే లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది.