స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్( Director Puri Jagannath ) కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకోగా గత కొన్నేళ్లుగా పూరీ జగన్నాథ్ ఒక్ హిట్ సాధిస్తే వరుసగా రెండు మూడు ఫ్లాపులతో కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు కూడా రాలేదు.
పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి( Vijay Sethupati ) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తలు నిజమయ్యాయి.
ఉగాది పండుగ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది.పూరీ కనెక్ట్స్( Puri Connects ) బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
ఛార్మి( Charmi ) పూరీ బ్యానర్ కు దూరమయ్యారనే వార్తల్లో కూడా నిజం లేదని తేలిపోయింది.

తాజాగా విడుదలైన ఫోటోలో పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి, ఛార్మి కనిపించడం గమనార్హం.పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతితో ఎలాంటి ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది.జూన్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
పూరీ జగన్నాథ్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చుడాల్సి ఉంది.

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.స్టార్ హీరోలు పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇవ్వడం కష్టమవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పూరీ జగన్నాథ్ ఈ సినిమాతో అయినా సక్సెస్ ట్రాక్ లోకి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
పూరీ జగన్నాథ్ కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాశ్ పూరీని కూడా హీరోగా సక్సెస్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.