అమెరికాకు( America ) చెందిన పాపులర్ బేబీ బ్రాండ్ ‘ఫ్రిడా’ ( Frida ) ఇప్పుడు మార్కెట్లోకి ఒక కొత్తరకం ఐస్‌క్రీమ్‌ను( Ice Cream ) తీసుకొస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.అదేనండి, తల్లి పాల రుచితో ఉండే ఐస్‌క్రీమ్.
వినడానికే వింతగా ఉంది కదూ? తమ కొత్త 2-ఇన్-1 మాన్యువల్ బ్రెస్ట్ పంప్ ప్రమోషన్‌లో భాగంగా ఈ ఐస్‌క్రీమ్‌ను లాంచ్ చేస్తున్నారు.
అసలు గమ్మత్తేంటంటే, ఈ వెరైటీ ఐస్‌క్రీమ్ టేస్ట్ చూడాలనుకునే వాళ్లు ఇప్పట్లో తినలేరు, ఏకంగా 9 నెలలు ఆగాల్సిందేనట.
అచ్చం బిడ్డ కడుపులో పెరిగే సమయాన్ని గుర్తుచేసేలా ఈ వెయిటింగ్ పీరియడ్ పెట్టామని కంపెనీ చెబుతోంది.అచ్చం తల్లి పాలలో( Breast Milk ) ఉండే ఆ “తియ్యని, క్రీమీగా, పోషకాలతో నిండిన” రుచిని ఈ ఐస్‌క్రీమ్‌లో అందిస్తామని ఫ్రిడా కంపెనీ చెబుతోంది.

ఇందులో మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాట్స్, శక్తినిచ్చే లాక్టోస్, ఐరన్, కాల్షియం, విటమిన్లు B, D, జింక్, ఇంకా శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు కావాల్సిన నీరు వంటి ముఖ్యమైన పోషకాలన్నీ ఉంటాయట.ఈ ఐస్‌క్రీమ్ రుచి తియ్యగా, నట్స్ ఫ్లేవర్‌తో, కొంచెం ఉప్పగా ఉంటుందని కంపెనీ వర్ణించింది.
ఇందులో నిజంగా తల్లి పాలు వాడారా అంటే ఈ ఐస్‌క్రీమ్‌లో నిజమైన తల్లి పాలు అస్సలు వాడలేదు.అమెరికాలో ఆహార నియంత్రణ సంస్థలు మనుషుల తల్లి పాలను వ్యాపార వస్తువుగా అమ్మేందుకు అనుమతించవు.
అందుకే, ఫ్రిడా కంపెనీ తెలివిగా తల్లి పాల రుచిని, అందులోని పోషకాలను పోలిన ఒక ఫార్ములాను తయారుచేసి ఈ ఐస్‌క్రీమ్‌ను రెడీ చేసింది.సో, టేస్ట్ సేమ్ టు సేమ్ అయినా, ఇందులో రియల్ తల్లిపాలు మాత్రం లేవన్నమాట.

ఈ ఐస్‌క్రీమ్ ప్రకటన రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.కొందరికి ఇది ఫన్నీగా అనిపిస్తే, చాలామంది ఇది ఏప్రిల్ ఫూల్స్ డే ప్రాంక్ ఏమో అని అనుమానపడ్డారు.“ఇది ఏప్రిల్ 1న అనౌన్స్ చేయాల్సింది బాస్” అని ఒక యూజర్ కామెంట్ చేస్తే, “ఎవరైనా దీన్ని కొంటే వాళ్లను నేను జడ్జ్ చేసేస్తా” అని ఇంకొకరు సరదాగా అన్నారు.మరికొందరు మాత్రం, “మనం తినే మామూలు ఐస్‌క్రీమ్ కూడా ఆవు పాలతోనే కదా చేస్తారు, దీనికింత ఆశ్చర్యపోవాలా?” అని లాజిక్ తీశారు.
ఈ కామెంట్లు, జోకులు ఎలా ఉన్నా, ఫ్రిడా కంపెనీ మాత్రం ఈ ఐస్‌క్రీమ్ నిజంగానే మార్కెట్లోకి వస్తుందని, దీనికి కచ్చితంగా మంచి డిమాండ్ ఉంటుందని ధీమాగా చెబుతోంది.ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు కంపెనీ వెబ్‌సైట్‌లో ఇప్పుడే ప్రీ-ఆర్డర్ కూడా చేసుకోవచ్చట.