వయసు పైబడిన ఫిట్ గా, యంగ్ గా ఉండాలంటే ఈ 7 ఆహారాలను డైట్ లో చేర్చుకోండి!

ఒకప్పుడు 60 ఏళ్ల వయసు వారు సైతం ఎంతో ఫిట్ గా ఉండేవారు.అన్ని పనులు చాలా చురుగ్గా చేసేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది.30 ఏళ్లకే చాలామంది బలహీనంగా మారిపోతున్నారు.అందుకు కారణం ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులే.కానీ ఇప్పుడు చెప్పబోయే ఏడు ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే వయసు పైబ‌డిన సరే సూపర్ ఫిట్ గా మ‌రియు యంగ్ గా ఉంటారు.

 Add These 7 Foods To Your Diet To Stay Fit And Young! 7 Foods, Health, Fitness,-TeluguStop.com

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

గ్రీన్ టీ( Green tea ).కేవలం బ‌రువు తగ్గడానికి మాత్ర‌మే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే.రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే వెయిట్ లాస్ అవుతారు.

ఫిట్ గా మారతారు.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

చర్మం యవ్వనంగా సైతం మెరుస్తుంది.వయసు పైబడినా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకునే వారు వారానికి కనీసం ఒక్కసారి అయినా చేపలను తీసుకోండి.

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయి.

అవకాడో( Avocado ).వయసు పైబడిన ఫిట్ గా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఈ పండును రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకోండి.రోజుకు ఒక అవకాడోను తీసుకుంటే శరీర బ‌రువు అదుపులో ఉంటుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.రక్తపోటు అదుపులో ఉంటుంది.కిడ్నీ, లివర్ ఆరోగ్యంగా ఉంటాయి.

అలాగే అవిసె గింజలు( Flax seeds ) రోజుకు ఒక స్పూన్ చొప్పున ఏదో ఒక విధంగా చేసుకోండి.ఇవి కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి.

ఎముకలను దృఢపరుస్తాయి.క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.

Telugu Foods, Avocado, Dark Chocolate, Fish, Fitness, Flax Seeds, Green Tea, Tip

డార్క్ చాక్లెట్ కూడా హెల్త్ కు ఎంతో మేలు చేస్తుంది.రోజుకు పరిమితంగా డార్క్ చాక్లెట్ ను తీసుకుంటే వయసు పైబడిన ఫిట్ గా, యంగ్ గా కనిపిస్తారు.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Telugu Foods, Avocado, Dark Chocolate, Fish, Fitness, Flax Seeds, Green Tea, Tip

తాజా కూరగాయలు ఆరోగ్యానికి, అందానికి చాలా మేలు చేస్తాయి.అతిగా నాన్ వెజ్ తినడం మానేసి తాజా కూరగాయలు తింటే హెల్త్ పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.ఇక వంటలకు ఏ నూనె పడితే ఆ నూనె వాడి జబ్బులు కొని తెచ్చుకుంటారు.కానీ ఫిట్ గా యంగ్ గా ఉండాలనికునేవారు ఎక్స్ట్రా వ‌ర్జిన్‌ ఆలివ్ ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.

ఎన్నో ప్రమాదకరమైన జబ్బులకు చెక్ పెట్టేందుకు ఈ ఆయిల్ ఉత్తమంగా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube