అత్త పోరు పడలేకపోతున్న మలేషియన్ మహిళ.. సోషల్ మీడియాలో ఏం చెప్పిందంటే..??

అత్త, కోడళ్ల ( Aunt , sister-in-law )మధ్య గొడవలు జరగడం చాలా కామన్.ముఖ్యంగా మన భారతదేశంలో గొడవలు పెట్టుకోకుండా అత్తా కోడలు ఉండలేరు.

 What Did The Malaysian Woman Who Couldn't Fight Her Aunt Say On Social Media , M-TeluguStop.com

ఈ గొడవల గురించి సీరియళ్లు, సినిమాలు కూడా ఎన్నో వచ్చాయి.అత్త, కోడళ్ల పోరు మన దేశానికే పరిమితం కాలేదు.

మలేషియాలోనూ ఇలాంటి సమస్య ఉన్నట్లు ఒక కోడలు పెట్టిన తాజా సోషల్ మీడియా పోస్ట్‌తో తెలిసిపోయింది.ఆ కోడలు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు చాలా వైరల్‌గా మారింది.

తన అత్త తన కొడుక్కి బాగా అటాచ్ అయిందని, తన భర్తతో ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఉండనివ్వదని ఆమె చెప్పింది. మలేషియన్‌ల( Malaysian ) కోసం ప్రత్యేకంగా ఒక ఫేస్‌బుక్‌ పేజీ ఉంది.

అందులో ఎవరైనా సరే తమ సమస్యలను అనానిమస్‌గా చెప్పి, సలహాలు అడగవచ్చు.ఆ మహిళ తన వివాహ జీవితం చాలా బాధాకరంగా సాగుతోందని ఆ పేజీలో రాసింది.

“నా అత్తగారికి కోడలితో ఎలా ప్రవర్తించాలో తెలియదు.పెళ్లై పదేళ్లు అయింది, నలుగురు పిల్లలు ఉన్నారు.

మేం అత్తింటి వాళ్లతోనే ఉంటున్నాం.నా భర్త కుటుంబానికి హెడ్ కాబట్టి, ప్రతి ఏడాది తన అన్నదమ్ముల కుటుంబాలు, పనివాళ్ళు, అమ్మాయిలతో కలిపి మొత్తం కుటుంబాన్ని విదేశాలకు తీసుకెళ్తాడు.ప్రతిసారి పెద్ద గుంపుగా వెళ్తాం.నా అత్తగారికి అసూయ, కోపం వస్తాయని మేం ఇద్దరం కలిసి ఎక్కడికీ వెళ్లలేకపోయాం.పండుగ సమయంలో కూడా మేం నా ఇంటికి వెళ్లాలంటే నా అత్తగారు కూడా అక్కడికి రావాలని పట్టుబడుతుంది.మాకు స్వేచ్ఛగా ఉండడానికి, ఒంటరిగా గడపడానికి అవకాశం లేదు.

ఆమె ఎప్పుడూ మా వెంటే ఉంటుంది.ఈ పది సంవత్సరాల్లో మేం ఎక్కడికీ వెళ్లలేదు.

ఎప్పుడూ పెద్ద గుంపుతోనే వెళ్లాల్సి వస్తుంది.అన్ని ఖర్చులు నా భర్తే చేస్తాడు.” అని చెప్పింది.

Telugu Latest, Malaysian, Mother Law, Nri-Telugu NRI

“చివరకు నా భర్త మా పిల్లలతో మాత్రమే ఒక ఫ్యామిలీ ట్రిప్‌కి తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు.నా అత్తగారికి ఈ విషయం తెలిసింది.తను కూడా ఈ ట్రిప్ కి వస్తానని చెప్పింది ఖర్చులు తానే పెట్టుకుంటా అన్నది.

అంతేకాదు, తన బంధువులను కూడా తీసుకురావాలని అనుకుంది.ఇలా అడ్డుపడితే నా భర్తకు ఇబ్బంది అవుతుందని నాకు తెలుసు.

నేను మా కుటుంబంతో ఒక ట్రిప్‌ వెళ్లాలని మాత్రమే కోరుకుంటున్నా.ఇందులో ఏమైనా తప్పుందా? నేను చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నానా?” అని ఆమె ప్రశ్నించింది.

Telugu Latest, Malaysian, Mother Law, Nri-Telugu NRI

అయితే భర్తదే ప్రాబ్లం అని, నిత్యం తల్లిని తన వెంట తీసుకుపోకుండా తనకంటూ ఒక ఫ్యామిలీ లైఫ్ మెయింటైన్ చేయాలనే ఆలోచన అతనికే ఉండాలని ఈ పోస్ట్ చదివిన వాళ్లు అంటున్నారు.సీక్రెట్ గా అన్ని ప్లాన్ చేసి వెళ్లే ముందు అత్తకి ఒక మాట చెప్పి వెళ్లి రావచ్చు అని మరి కొంతమంది అన్నారు.గొడవలు అయితే అవ్వనివ్వండి జీవితాన్ని భయపడుకుంటా గడపవద్దని మరి కొంతమంది అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube