ఉల్లితో చర్మానికి మెరుగులు.. ఇలా వాడితే ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటుంటారు.ఎందుకంటే ఆరోగ్య‌ పరంగా ఉల్లి( Onion ) అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

 How To Use Onion For Spotless And Glowing Skin Details, Spotless Skin, Glowing-TeluguStop.com

అనేక జబ్బులకు అడ్డు కట్ట వేస్తుంది.అయితే కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఉల్లి చాలా మేలు చేస్తుంద‌ని మీకు తెలుసా.? సాధారణంగా కొందరికి ముఖంపై నల్లటి మచ్చలు( Dark Spots ) ఏర్పడుతుంటాయి.ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవి ఓ పట్టాన వదలవు.

అటువంటి మచ్చలను ఉల్లితో సుల‌భంగా వ‌దిలించుకోవ‌చ్చు.మరి ఇంతకీ ఉల్లితో చర్మానికి మెరుగులు ఎలా పెట్టవచ్చో తెలుసుకుందాం ప‌దండి.

Telugu Tips, Skin, Gram, Latest, Benefits, Face Pack, Raw Milk, Skin Care, Skin

ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ ని తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన ఉల్లిపాయను సన్నగా తురుముకుని స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి( Gram flour ) వేసుకోవాలి.అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఉల్లి రసం, వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు( Milk ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Gram, Latest, Benefits, Face Pack, Raw Milk, Skin Care, Skin

ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసుకుని ప‌ది నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఈ లోపు స్కిన్ డ్రై అయిపోతుంది.అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా రోజుకు ఒక్కసారి చేశారంటే చర్మం పై ఎలాంటి ముదురు రంగు మచ్చలు ఉన్న క్రమంగా మాయం అవుతాయి.

మొండి మచ్చలను తరిమి కొట్టి క్లియర్ స్కిన్ ను అందించడంలో ఈ రెమెడీ చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.అదే సమయంలో శనగపిండి, పాలు, ఉల్లి చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను మ‌రియు మురికి తొలగిస్తాయి.

చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి.బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను సైతం సమర్థవంతంగా దూరం చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube