వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

క్రికెట్ ( Cricket )అంటే కేవలం పరుగులు, వికెట్లు మాత్రమే కాదు.ఇందులో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.

 Viral Video Hey Kids, It's Not A Dance Floor, It's A Cricket Match, Funny Cricke-TeluguStop.com

అలాంటి అనూహ్యమైన సంఘటనలు క్రికెట్ అభిమానులకు ఎంతో వినోదాన్ని అందిస్తాయి.మ్యాచ్‌ల మధ్యలో ఎదురయ్యే ఫన్నీ మువ్‌మెంట్స్ క్రికెట్‌కు ప్రత్యేకమైన అందాన్ని తీసుకువస్తాయి.

బ్యాటర్ సడన్‌గా పడిపోవడం, బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో డాన్స్ చేయడం, స్టేడియానికి అభిమానులు చొచ్చుకు రావడం వంటి సంఘటనలు గతంలో ఎన్నోసారి చూశాం.తాజాగా, అలాంటి ఫన్నీ ఘట్టం ఓ స్టేట్ లెవెల్ క్రికెట్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది.

ఇటీవల బిలాస్పూర్( Bilaspur ), మరో లోకల్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.మ్యాచ్ జరుగుతున్న సమయంలో రన్ అవుట్ చేసే సునవకాశం వచ్చినా, అక్కడ ఉన్న ప్లేయర్లు అప్పుడే బంగ్రా డాన్స్ వేస్తూ సందడి చేశారు.

వైభవ్ శర్మ ఆఫ్ సైడ్( Vaibhav Sharma is offside ) వైపుకు చిన్న షాట్ ఆడగా, నెమ్మదిగా సింగిల్ పరుగు మాత్రమే సాధ్యమయ్యేది.అయితే, అతడితో పాటు ఉన్న జోడీ ఇద్దరూ రెండో పరుగు కోసం ప్రయత్నించారు.

ఆ సమయంలో బిలాస్పూర్ జట్టు ఆటగాళ్లు చాకచక్యంగా ఫీల్డింగ్ చేసి బంతిని వికెట్ కీపర్ వైపు పంపారు.ఈ సమయంలో ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజు దాటి రావడానికి ఆలస్యం చేయడంతో, అవుట్ చేసేందుకు చాలా సమయం పట్టింది.

ఇది వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.

ఆ సమయంలో వికెట్ కీపర్ సహా ఇతర ఫీల్డర్లు రన్ అవుట్ చేసే బదులు మైదానంలో బాంగ్రా స్టెప్పులు వేస్తూ సందడి చేశారు.ఆ స్టెప్పులు వేసిన తర్వాతే బ్యాటర్లను రన్ అవుట్ చేశారు.ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఈ వీడియోకు భారీగా రియాక్షన్లు వచ్చాయి.అలాగే ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

మొత్తానికి ఈ స్టేట్ లెవెల్ మ్యాచ్ నుంచి వచ్చిన చిన్న ఫన్నీ మూమెంట్, కోట్లాది వ్యూస్ సంపాదిస్తూ అందరికీ నవ్వు పంచుతోంది.ఈ మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగిందో స్పష్టతగా తెలియకపోయినా, ఇది ఇండియాలోని దేశవాళీ క్రికెట్ మ్యాచ్ అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube