మొటిమలు ఎంతకూ తగ్గట్లేదా? అయితే జామ ఆకు తో ఇలా చేయండి!

మొటిమలు అత్యంత సర్వసాధారణంగా వేధించే చర్మ సమస్యల్లో ఒకటి.అందులోనూ టీనేజ్ లో యువతీ యువకులను మొటిమలు చాలా అంటే చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి.

 Guava Leaves Help To Reduce Acne Naturally! Guava Leaves, Reduce Acne, Acne Trea-TeluguStop.com

ఈ క్రమంలోనే మొటిమలను వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.ర‌క‌ర‌కాల చిట్కాల‌ను పాటిస్తుంటారు.

అయితే ఒక్కోసారి ఎంతకూ మొటిమలు తగ్గవు.అలాంటి సమయంలో జామ ఆకులతో ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్‌ రెమిడీని క‌నుక పాటిస్తే రెండు రోజుల్లోనే మొటిమల సమస్యను వదిలించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం జామ ఆకులను మొటిమల నివారణకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందు నాలుగు లేదా ఐదు ఫ్రెష్ జామ ఆకులను తీసుకుని నీటిలో శుభ్రంగా కడగాలి.

ఇలా కడిగిన జామ ఆకులను మిక్సీ జార్ లో వేసి, కొద్దిగా వాట‌ర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి స్ట్రైన‌ర్ స‌హాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జామ ఆకుల జ్యూస్ లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్ని కలిసేంత వరకు స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే జామ ఆకుల్లో ఉండే ప్ర‌త్యేక సుగుణాలు ఎంతటి మొండి మొటిమల‌ను అయినా సరే చాలా త్వరగా మ‌రియు సుల‌భంగా త‌గ్గిస్తాయి.

మొటిమల తాలూకు మచ్చలు ఉన్న క్రమంగా మాయం అవుతాయి.కాబట్టి ఎవరైతే మొటిమల స‌మ‌స్య‌తో తీవ్రంగా సతమతం అవుతున్నారో.వారు తప్పకుండా జామ ఆకులతో పైన చెప్పిన సింపుల్ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube