రోజు నైట్ ఈ టీ ని తీసుకుంటే అధిక బరువు నుంచి నిద్రలేమి వరకు అన్ని పరార్!

టీ.ఈ పేరు వింటే చాలు చాలామందికి ఎక్కడాలేని ఎనర్జీ వస్తుంది.

 If You Take This Tea, Everything From Being Overweight To Insomnia Will Be Cured-TeluguStop.com

ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగితే వచ్చే మజా అంతా ఇంతా కాదు.అయితే టీ ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు అంటుంటారు.

కానీ అందులో నిజం లేదు.మితంగా తీసుకుంటే టీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీ ని రోజు నైట్ నిద్రించే ముందు తీసుకుంటే అధిక బరువు నుంచి నిద్రలేమి వరకు ఎన్నో సమస్యలు పరార్ అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీ ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Herbal Tea, Insomnia, Latest, Tea-Telugu Health

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అంగుళం దాల్చిన చెక్క, మూడు యాలకులు, నాలుగు నల్ల మిరియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోయాలి.వాటర్ కాస్త మరిగిన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న నల్ల మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి.అలాగే హాఫ్‌ టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Tips, Herbal Tea, Insomnia, Latest, Tea-Telugu Health

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి తయారు చేసుకున్న టీ ని ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజు నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ టీని తీసుకోవాలి.తద్వారా మెటబాలిజం రేటు అద్భుతంగా పెరుగుతుంది.దాంతో క్యాలరీలు త్వరగా కరిగి అధిక బ‌రువు సమస్య దూరమవుతుంది.అలాగే ఈ హెర్బల్ టీ ని తీసుకోవడం వల్ల నిద్రలేమి నుంచి విముక్తి లభిస్తుంది.గుండె జ‌బ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.జలుబు, దగ్గు, గొంతు వాపు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.

మరియు మలబద్ధకం సమస్య నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube