అడ్డంకులను, ఆపదలను తొలగిస్తూ ఆయురారోగ్యాలు బాగుండాలని దీవించే దేవుడు విఘ్నేశ్వరుడు.హిందూ దేవుళ్ళలో ఎందరు దేవుళ్ళు ఉన్నా సరే మొదటి పూజలు మాత్రం ఆ గననాధుడికే.
పూర్వీకుల కాలం నుండి నేటివరకూ ప్రపంచదేశాలలో భక్తులచే విశేష పూజలందుకుంటూ కోరిన వరాలు తీర్చే బొజ్జ గణపయ్యగా ఆయన చాలా ఫేమస్.అయితే చిత్తూరు జిల్లాలోని స్వయంభు గణపతిగా వెలసిన కాణిపాక వరసిద్ధి వినాయకుడి క్షేత్రానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది….
ఇప్పుడు ఈ క్షేత్ర మహత్మ్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.( పురాణాలలోని కథలు ప్రకారం).
1.ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కాణిపాకంగా పిలవబడుతున్న ఆ గ్రామాన్ని ఒకప్పుడు ‘విహారపురి’గా పిలిచేవారు.పచ్చని పొలాలతో ఆ ఊరు కళకళలాడుతూ ఉండేది.ఆ గ్రామంలో పుట్టుకతోనే మూగ,చెవిటి, అంధకారంతో ముగ్గురు సోదరులు జన్మించారు.వీరికున్న ఆస్తి 25 ఎకరాల పొలం మరియు ఒక పెద్ద బావి.వ్యవసాయం చేసుకుంటూ ఆ ముగ్గురు సోదరులు తమ జీవనం సాగించేవారు.
పచ్చని పొలాలతో సస్యశామలంగా ఉన్న ఆ గ్రామం కరువు, కాటకాలతో ఆకలి బాధలు ఎదుర్కుంది.ఆ సోదరుల బావిలో నీళ్ళు తగ్గిపోవడంతో బావిని తవ్వడం ప్రారంభించారు.
అలా లోతుకు తవ్వుతుండగా ఒక బండరాయి గునపానికి గట్టిగా తగిలింది.ఆ రాయిని పక్కకు పార, గునపం తీసుకొని మట్టిని పక్కకు తీస్తూ, ఆ రాయి మీద గునపంతో ఓకే పోటు వేయగా,ఆ బండరాయి నుండి రక్తం బయటకు వచ్చి ఆ ముగ్గురు సోదరులపై పడింది.
2.రక్తం వారి శరీరంపై పడగానే మూగవాడికి మాటలు, చెవిటతనికి వినికిడి, అంధుడికి చూపు వచ్చాయి.
వెంటనే ఆ ముగ్గురు సోదరులు జరిగిన విషయాన్ని గ్రామ ప్రజలకు,రాజుకు తెలుపగా వారు వచ్చి ఆ బావిని మరింత లోతుకు తవ్వగా వినాయకుడి ప్రతిమ బయటపడింది.ఆ ముగ్గురు సోదరులు తెలియక చేసిన తప్పును క్షమించమని ఆ గ్రామ ప్రజలు కోరుతూ భక్తి శ్రద్ధలతో టెంకాయలను కొడుతూ వినాయకుడ్ని పూజిస్తుండగా, టెంకాయ నీళ్ళు అక్కడి కాణి భాగం అంతా ప్రవహించాయట.
ఇలా వినాయకుడు స్వయంభుగా ఆవిర్భించడంతో ‘విహారపురి’ని కాస్తా ‘కాణిపాకం’గా మార్చారట.
3.11వ శతాబ్దంలో చోళ రాజైన కుళోత్తుంగ రాజు ఈ ఆలయ నిర్మాణం చేసినట్లు ఆధారాలున్నాయి.ఆ తర్వాత 1336లో విజయ నగర సామ్రాజ్య రాజులు ఆ క్షేత్రాన్ని ఇంకా పెద్దదిగా ఉండేలా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చేశారాట.
అలాగే ఇక్కడ వినాయకుడి చుట్టూ నీరు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుందంట.ఆ ముగ్గురు సోదరులు బావిని తవ్వుతున్నప్పుడు గడ్డపార వేసిన పోటు స్వామివారి వెనుక భాగంలో ఉందట.
4.మాములుగా అన్ని పుణ్యక్షేత్రాలలోనూ శిల్పులచే చెక్కిన విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి.
అయితే కాణిపాకంలో ఉన్న వరసిద్ధి వినాయకుడు స్వయంభుగా భూమి నుండి ఉద్భవించాడని పెద్దలు చెబుతున్నారు.అలాగే ఈ విగ్రహం రోజురోజుకు క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు.
5.పెద్దలు చెబుతున్న ప్రకారం కాణిపాక వినాయకుడు మొదటి ఉదరభాగం,మోకాళ్ళు,బొజ్జ వరకే కనిపించేదట.
అయితే స్వామి పెరుగుదలకు నిదర్శనగా లక్షమ్మ అనే భక్తురాలు వెండి కవచం చేయించగా ప్రస్తుతం ఆ వెండి కవచం సరిపోవడం లేదట.
6.కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఆలయం పక్కనే బహుదానది ఉంది.ఈ నదికి ఒక ఇతిహాసం ఉంది.
పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు తమ గ్రామం నుండి స్వామివారిని దర్శించుకోడానికి బయలుదేరారట.ఆ ప్రయాణంలో వారికి అవసరమైన భోజనం,ఫలహారాలను ఇంటి నుండే తీసుకువెళ్లారట.
అయితే మార్గమధ్యంలో వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయట.నడిచి నడిచి అలసట రావడంతో లిఖితుడు ఆకలి వేయడంతో పక్కనే ఉన్న మామిడిచెట్టు నుండి ఒక మామిడిపండును కోసుకుంటానని తన అన్న శంఖుడితో చెప్పాడట.
అలా దొంగతనంగా కోసుకోవడం ధర్మ విరుద్ధమని శంఖువు చెప్పాడు.ఆకలి బాధలో ఉన్న లిఖితుడు అన్న మాటలు పట్టించుకోకుండా మామిడిపండు కోసుకొని తిన్నాడట.ఇలా ధర్మ విరుద్ధంగా చేసిన తన తమ్ముడిని ఆ ప్రాంత రాజు వద్దకు తీసుకెళ్లి జరిగిన విషయాన్ని చేసిన తప్పును తెలిపాడట శంఖుడు.
7.ఆ రాజు లిఖితుడు రెండు చేతులను నరికివేయమని తీర్పునిచ్చాడట.అలా లిఖితుడు రెండు చేతులను క్రూరంగా నరికివేశారు.
అయితే ఆ క్రూరమైన రాజు ఇంత పని చేస్తాడని ఊహించని శంఖుడు, లిఖితుడుని తీసుకొని కాణిపాకం బయలుదేరాడట.గుడి పక్కనే ఉన్న నదిలో స్నానం చేయడానికి ఇద్దరు దిగారు.
నీటిలో మునిగి పైకి తేలగానే లిఖితుడు రెండు చేతులు యధాస్థితికి వచ్చాయి.ఇలా బాహువులు (చేతులు) ఇచ్చిన నది కావడంతో బాహుదానది, బహుదా నది అని ఆ నదికి పేరు వచ్చిందట.
8.భక్తులకు మొర ఆలకించే కాణిపాక వినాయకుడికి మరో ప్రత్యేకత ఉంది.సత్య ప్రమాణాలకు నెలవుగా చెబుతారు.ఎటువంటి తప్పులు ఉన్నా స్వామివారి ముందు బయటపడతాయి.
9.స్వామి వారి ముందు ప్రమాణాలు చేయాగానే ఎటువంటి సమస్యలైనా సరే ఇట్టే తీరిపోతాయట.ఇక్కడి నదిలో స్నానం ఆచరించి ప్రమాణాలు చేస్తే ఎవరు తప్పు చేశారా? ఎవరు నిజం చెబుతున్నారనేది బయటపడుతుందట.
10.అలాగే చెడు అలవాట్లను మానుకోలేని వారు,సమస్యలతో బాధపడేవాళ్ళు ఆ సమస్యల నుండి బయటపడతారట.ఒకసారి తప్పు జరిగిన తర్వాత వినాయకుడి ముందు మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటారని విశ్వాసం.
స్వామి ముందు ప్రమాణం చేసి తప్పు మాట్లాడితే కీడు జరుగుతుందని చెబుతారు.
ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి: చిత్తూరు నుండి కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం, కాణిపాకం:11కి.మీ చెన్నై నుండి కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం, కాణిపాకం:172 కి.మీ తిరుపతి నుండి కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం, కాణిపాకం (వయా శ్రీకాళహస్తి):140కి.మీ
.