తమ ముఖ చర్మం వైట్ గా మరియు గ్లోయింగ్ గా మెరిసి పోవాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి.ముఖ్యంగా అమ్మాయిలు అయితే అలాంటి చర్మం కోసం ఆరాట పడని రోజంటూ ఉండదు.
అయితే అందరూ అలాంటి చర్మాన్ని పొందడం అసాధ్యమని ఫీల్ అవుతూ ఉంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఎఫెక్ట్ రెమెడీని కనుక పాటిస్తే మీ ముఖ చర్మం తెల్లగా మారడమే కాదు గ్లోయింగ్ గా సైతం మెరుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసి వాటర్ తో రెండు సార్లు కడగాలి.
అనంతరం ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.ఉదయాన్నే ఒక బీట్ రూట్ తీసుకొని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన బీట్ రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ బీట్ రూట్ పేస్ట్ నుండి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నైట్ అంతా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి.అలాగే తయారు చేసి పెట్టుకున్న బీట్ రూట్ జ్యూస్ తో పాటు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.

ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకుని.అప్పుడు నార్మల్ వాటర్ తో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే ముఖ చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.
చర్మంపై ఏమైనా ముదురు రంగు మచ్చలు ఉంటే క్రమంగా మాయం అవుతాయి.ఈ రెమెడీని పాటించడం వల్ల ఆయిలీ స్కిన్ నుంచి సైతం విముక్తి లభిస్తుంది.