ప్రతి సంవత్సరం దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం( Karthika Masam ) మొదలవుతుంది.కానీ ఈ సంవత్సరం దీపావళి మరుసటి రోజు కాకుండా రెండవ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథే నెల ప్రారంభానికి సూచన.ఎందుకంటే కార్తిక స్నానాలు చేసేది బ్రహ్మ ముహూర్తం లో కాబట్టి నవంబర్ 12న దీపావళి మరుసటి రోజు నవంబర్ 13 సోమవారం సూర్యోదయానికి అమావాస్య ఉంది.
అందుకే నవంబర్ 14 మంగళవారం సూర్యోదయం సమయానికి పాడ్యమి ఉండడంతో ఆ రోజు నుంచే ఆకాశదీపం మొదలవుతుంది.అంటే నవంబర్ 14వ తేదీన మంగళవారం రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది.

కార్తీక మాసం నెల రోజులు ప్రజలు అత్యంత నిష్ఠతో ఉంటారు.కార్తీక మాసం నియమాలు పాటించేవారు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.అలాగే చలి గాలులు పెరిగే సమయం కాబట్టి ఈ నెలలో పేదలకు, అనాధలకు, స్వెటర్లు, దుప్పట్లు దానం చేస్తే శివ కేశవుల అనుగ్రహం లభిస్తుందని కూడా చెబుతున్నారు.దాన ధర్మాలు గోప్యంగా చేసిన వారికి ఎక్కువ ఫలితాలు లభిస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.
అలాగే కార్తీక మాసంలో ఈ పనులను అస్సలు చేయకూడదు.వాంఛలు పెంచే ఉల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండడం ఎంతో మంచిది.
కనీసం ఈ నెల రోజులు ఒక నియమంలా పాటిస్తూ పాపపు ఆలోచనలు, ఒకరికొకరికి ద్రోహం చేయాలనే ఆలోచనలను అస్సలు చేయకూడదు.

విశ్వాసం ఉంటే దేవుడుని పూజించాలి.లేదంటే మానేయాలి.దైవదూషణ అసలు చేయకూడదు.
మినుములు తినకూడదు.నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.
దీపారాధనకు తప్ప నువ్వుల నూనెను ఇతర అవసరాలకు అసలు ఉపయోగించకూడదు.కార్తీకమాసం శివుడికి మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.
కార్తీక పురాణంలో కార్తీక సోమవారం జ్వాలాతోరణం మహాశివుడి( Lord shiva ) ప్రాముఖ్యతను తెలియజేస్తే బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది, ద్వాదశి శ్రీమహావిష్ణువు ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి.కార్తిక పురాణాలలో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను,ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి.
కాబట్టి ఈ సంవత్సరం నవంబర్ 14 మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతుంది డిసెంబర్ 13 బుధవారం పోలి స్వర్గంతో కార్తిక మాసం పూర్తవుతుందనీ పండితులు చెబుతున్నారు.