Keerthy Suresh Kamal Haasan: కీర్తి సురేష్ పై ప్రశంసల వర్షం కురిపించిన కమల్ హాసన్.. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కీర్తి సురేష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Kamal Haasan Praises Keerthy Suresh In Maamannan Movie Audio Launch Event-TeluguStop.com

ఇటీవల దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.తెలుగులోనే కాకుండా కోలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తోంది.

తమిళంలో మామన్నన్ మూవీలో( Maamannan Movie ) నటించింది.డైరెక్టర్ మరి సెల్వరాజ్ రూపొందించిన ఈ మూవీలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించారు.

Telugu Bhola Shankar, Dasara, Kamal Haasan, Kamalhaasan, Keerthy Suresh, Maamann

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ తాజాగా చెన్నైలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు తమిళ్ సినీ ప్రముఖులలో ఒకరైన కమల్ హాసన్( Kamal Haasan ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్బంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.మామన్నన్‌ సినిమా భారీ విజయం సాధించాలని నా కోరిక.ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి.

మరి సెల్వరాజ్ ఇతరులు అభిప్రాయాలకు విలువ ఇస్తారు.ఆయనలో అదే నాకు చాలా ఇష్టం.

Telugu Bhola Shankar, Dasara, Kamal Haasan, Kamalhaasan, Keerthy Suresh, Maamann

ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను అని తెలిపారు.అనంతరం కీర్తి సురేష్ గురించి మాట్లాడుతూ.కీర్తి గొప్ప నటి. ఆమె బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ కితాబిచ్చారు.అలాగే ఈ సినిమాలో నటించేందుకు కీర్తి ఒప్పుకోవడం ప్రశంసించదగిన విషయం అని తెలిపారు కమల్ హసన్. ఇకపోతే కీర్తి సురేష్ విషయానికి వస్తే.ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ తన స్పీడ్ ని పెంచేసింది.నాని కీర్తి సురేష్ కలిసి నటించిన దసరా సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube