నువ్వుల్లో రెండు రకాలు.అందులో ఒకటి తెల్ల నువ్వులు కాగా.
మరొకటి నల్ల నువ్వులు.( Black sesame seeds )చాలామంది తెల్ల నువ్వులనే వాడతారు.
కానీ తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.నల్ల నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్ తో పాటు విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
నల్ల నువ్వులు నిత్యం ఇప్పుడు చెప్పబోయే విధంగా తెలుసుకుంటే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు నల్ల నువ్వుల పొడి వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత ఒక టీ స్పూన్ బెల్లం పొడి ( Jaggery powder )కలిపి మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ ను నిత్యం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా ఆడవారికి ఈ నల్ల నువ్వుల పానీయం ఒక వరం అని చెప్పుకోవచ్చు.నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది.పీరియడ్స్ టైమ్ లో కాళ్లు లాగేయడం, నడుము నొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలకు ఈ డ్రింక్ చెక్ పెడుతుంది.
అలాగే చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు.అలాంటివారు నిత్యం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే శరీరానికి సరిపడా ఐరన్ అందుతుంది.
హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.రక్తహీనత దూరం అవుతుంది.
నల్ల నువ్వులు కాల్షియం యొక్క అద్భుతమైన మూలం.అందువల్ల నల్ల నువ్వులను డైట్ లో చేర్చుకుంటే బలమైన ఎముకలను నిర్వహించడానికి మరియు బోలు ఎముకల వ్యాధిని( Osteoporosis ) నివారించడానికి తోడ్పడతాయి.నల్ల నువ్వులలో ఉండే అసంతృప్త కొవ్వులు మరియు యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.నల్ల నువ్వులలో మెండుగా ఉండే విటమిన్ బి6 మరియు మెగ్నీషియం వంటి పోషకాలు మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.జ్ఞాపక శక్తిని పెంచుతాయి.
అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి.నల్ల నువ్వులలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ సహాయపడతాయి.