Weakness : ఎప్పుడు నీరసంగా ఉంటుందా..? అయితే ఈ లోపం ఉన్నట్టే..!

సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే అన్ని రకాల మినరల్స్ సక్రమంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.

 What Causes Weakness In Body Details-TeluguStop.com

పోషకాల విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా కూడా వెంటనే ప్రభావం చూపిస్తుంది.ఇలా శరీరంలో కీలకపాత్ర పోషించే వాటిలో పొటాషియం కూడా ఒకటి.

శరీరంలో పొటాషియం నీటి పరిమాణంతోపాటు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది.అలాగే శరీరంలో సరిపడ పొటాషియం లేకపోతే కొన్ని రకాల సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది.

కొన్ని రకాల లక్షణాల ద్వారా పొటాషియంలో పని కూడా గుర్తించవచ్చు.ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Banana, Eggs, Tips, Nuts, Potassium, Sweet Potatoes, Tomatoes, Weakness-T

శరీరంలో సరిపోడా పొటాషియం( Potassium ) లేకపోతే కండరాలు బలహీనంగా మారుతాయి.అలాగే నిత్యం కండరాలు పట్టుకుపోయిన భావన కలుగుతూ ఉంటుంది.ఇది పొటాషియం లోపానికి ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు.మరికొందరిలో నిత్యం అలసట, గుండె సాధారణ రీతిలో కొట్టుకోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.ఇక ఇలాంటి సందర్భాల్లో ఆకలి లేకపోవడం, మానసిక కొంగుబాటుకు గురి కావడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.అంతేకాకుండా శరీరంలో పొటాషియం లోపిస్తే, ఆకలి లేకపోవడం, మానసిక కొంగుబాటు, నిత్యం వాంతులు, విరేచనాలు కూడా అవుతూ ఉంటాయి.

Telugu Banana, Eggs, Tips, Nuts, Potassium, Sweet Potatoes, Tomatoes, Weakness-T

మలంలో రక్తం రావడం కూడా పొటాషియం లోపానికి సూచనగా భావించాలని నిపుణులు చెబుతూ ఉంటారు.సాధారణంగా మనకు రోజుకు 2.5 గ్రాముల నుండి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం ఉంటుంది.అయితే పొటాషియం ఎక్కువగా లభించాలంటే ప్రతి రోజు ఒక కోడి గుడ్డును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా టమాటాలు, చిలకడ దుంపలు, నట్స్ లాంటివి తీసుకున్న కూడా పొటాషియం లభిస్తుంది.

ఇక అరటిపండ్లలో కూడా పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.కాబట్టి రక్తపోటును తగ్గించి మానసిక ప్రశాంతను పొందడానికి అరటిపండు( Banana )ను తీసుకోవడం మంచి ఎంపిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube