ఈ ఆహార పదార్థాలను తినడం అలవాట్లను చేసుకుంటే.. ఎలాంటి రోగాల సమస్య ఉండదు..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో జీవిస్తున్న ప్రజలకు ఆరోగ్యమే మహాభాగ్యం అని బాగా తెలుసి వచ్చింది.అయినప్పటికీ చాలామంది ప్రజల మనసు జంక్ ఫుడ్( Junk food ) వైపే మొగ్గు చూపుతూ వస్తోంది.

 If You Make A Habit Of Eating These Food Items There Will Be No Problem Of Any D-TeluguStop.com

వాటిని అతిగా తినడం వల్ల ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు( Obesity and heart problems ) ఎదురవుతాయి.అందుకే శరీరం ఒక రకమైన ఆహారానికి బానిస కాకుండా అన్నిటినీ సమతుల్యంగా తీసుకోవడం ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మీ డైట్ లో పోషకమైన ధాన్యాలు,అకు కూరలు చేర్చుకోవాడం మంచిది.ఈ ఆహార పదార్థాలను కచ్చితంగా మీ డైట్ లో చేర్చుకుంటే ఎటువంటి రోగాలు మీ దగ్గరికి రావు.

ముఖ్యంగా చెప్పాలంటే వారానికి కనీసం మూడు రోజులైనా ఆకుపచ్చని కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి.కనీసం వారానికి ఒక్కసారైనా పప్పు తినడం మంచిది.శరీరానికి తగినంత ప్రోటీన్ అంది జీవక్రియ మెరుగుపడుతుంది.

అంతేకాకుండా ఆహారంలో రోజుకి కనీసం రెండు సార్లు తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలని పోషక నిపుణులు సూచిస్తున్నారు.గోధుమపిండి, బార్లీ పిండి లాంటి ఫైబర్ ఎక్కువగా ఉన్నా పదార్థాలను చేర్చుకోవడం మంచిది.ప్రతిరోజు రెండు లేదా నాలుగు బెర్రీలు తినేలా చూసుకోవడం మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే వారానికి రెండు నుంచి మూడు రోజులు చేపలను తినాలని ఈ వైద్యులు చెబుతున్నారు.ఎందుకంటే చేపలలో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. సాల్మన్, బ్లూ ఫిష్ వంటి వాటిని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

అంతేకాకుండా 19 నుంచి 50 సంవత్సరాల మధ్య పురుషులు, స్త్రీలకు కనీసం రోజుకి 1000ఎంజీ కాల్షియం అవసరమవుతుంది.50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వారికి 1200 ఎంజి కాల్షియం అవసరం అవుతుంది.రోజువారి కాల్షియం అవసరాలని తీర్చడానికి తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు తీసుకోవడం మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు 8 నుంచి 12 గ్లాసుల వరకు నీటిని కచ్చితంగా తాగడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube