సరైన ఆహారపు అలవాట్లు జీవనశైలిని అనుసరిస్తే అన్ని రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.కానీ ప్రస్తుతం మనపై ఉన్న కుటుంబ ఉద్యోగ బాధ్యతల కారణంగా అది అసాధ్యంగా మారింది.
అయితే ఈ క్రమంలో వంటగదిలోని కొన్ని పదార్థాలను తప్పనిసరిగా ఆహారంలో కలిపి తీసుకున్న సరిపోతుంది.అలాంటి పదార్థాలు లేదా మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క( Cinnamon) ముఖ్యమైనది.
ప్రస్తుతం మానవాళిని వణికిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ప్రథమ స్థానంలో ఉన్న గుండె సంబంధిత సమస్యలకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
ముఖ్యంగా గుండె జబ్బులకు( Heart problems) కారణమైన కొలెస్ట్రాల్ కి ఇది యమపాశం గా పనిచేస్తుంది.
దీనిలోని గుణాలు అలాంటివి మరి.ఇందులోని సిన్నమాల్డిహైడ్, సిన్నమిక్ యాసిడ్, సిన్నమేట్ వంటి సమ్మేళనాలు, కేలరీలు, ప్రోటీన్స్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ ఏ వంటి అనేక రకాల పోషకాలు మన ఆరోగ్యాన్ని సంరక్షించడంలో అనేక సమస్యలను దూరం చేయడం లో ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇంకా చెప్పాలంటే దాల్చిన చెక్కలలో యాంటీ ఆక్సిడెంట్స్ చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతాయి.ఇంకా కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది నిరూపితమైన విషయం అని పరిశోధకులు చెబుతున్నారు.అంతే కాకుండా దాల్చిన చెక్క బ్లడ్ షుగర్( Blood Sugar) ని కూడా నియంత్రిస్తుంది.ఒక వేళ మీ శరీరంలో కొలెస్ట్రాల్ తొలిగిపోకపోతే అది రక్తపోటు, హార్ట్ ఎటాక్ సహా పలు రకాల గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.
అందువల్ల ఆహారంలో దాల్చిన చెక్క తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.నీటిలో పొడి రూపంలో కూడా దీన్ని తీసుకోవచ్చు.అయితే దాల్చిన చెక్కను అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.కాబట్టి దాన్ని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.