విశాల్. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో అద్భుతంగా రాణిస్తున్న నటుడు.తమిళ సినిమా అసోషియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.తమిళనాడులో వరదలు బీభత్సం కలిగించినప్పుడు అక్కడి జనాలకు అండగా నిలిచాడు.స్వయంగా నీటమునిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ఆహార పొట్లాలతో పాటు నిత్యవసర సరుకులు అందించాడు.పేదలకు ఆర్థికసాయం కూడా అందజేశాడు.
తమిళనాట ఎక్కడ సమస్య ఉన్నా తనకు తోచిన సాయం చేస్తూ రియల్ హీరోగా గుర్తింపు పొందాడు.ప్రస్తుతం విశాల్ గురించి కాదు గానీ.
ఆయన తండ్రి వార్తల్లోకి ఎక్కాడు.విశాల్ తండ్రి మరెవరో కాదు.
ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త జికె రెడ్డి.ఆయన వయసు 83 ఏండ్లు.అయినా అద్భుతమైన ఫిట్ నెస్ తో వారెవ్వా అనిపిస్తున్నాడు.హీరో విశాల్ కే సాధ్యం కాని రీతిలో.కండలు తిరిగిన దేహంతో అదరగొడుతున్నాడు.ఈ ఏజ్ లో ఇంతలా బాడీ ఫిట్ నెస్ కలిగి ఉండటం.
అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
తాజాగా విశాల్ తండ్రి జికె రెడ్డి ఫిట్ ఇండియా అంబాసిడర్ గా నామినేట్ అయ్యాడు.
ఈ వయసులో ఆయన సాధించిన ఫిట్ నెస్ కు అందరూ శభాష్ అంటున్నారు.ఆయను అంబాసిడర్ గా ఎంపిక చేసినట్లు ఫిట్ ఇండియా మిషన్ అఫీషియల్ గా ప్రకటించింది.
ప్రస్తుతం ఆయన ఈ పోస్టుకు ఎంపిక కావడం పట్ల సర్వత్రా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనా తొలి వేవ్ లో విశాల్ తో పాటు విశాల్ తండ్రి జికె రెడ్డి కరోనా మహమ్మారి బారిన పడ్డారు.అప్పటికే వ్యాయమం చేయడంలో మంచి అనుభవం ఉన్న రెడ్డి.త్వరగానే కరోనా నుంచి బయటపడ్డాడు.
ఆ తర్వాత ఆయన ఫిట్ నెస్ పై మరింత ఫోకస్ పెట్టాడు.రోజుకు గంటల తరబడి ఆయన వ్యాయామం చేస్తాడు.
మంచి ఫిట్ నెస్ కోసం పలువురు నిపుణుల సాయంతో జిమ్ చేస్తాడు.యోగా లోనూ ఆయనకు మంచి నిపుణత ఉంది.
అంతేకాదు.యోగా, వ్యాయామం మూలంగా ఆరోగ్యంతో పాటు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్తాడు జికెరెడ్డి.