Kamal Haasan Sarika : కమల్ చేసిన పనికి తట్టుకోలేక బాల్కనీ లో నుంచి దూకిన సారిక..!

కమల్ హాసన్ సారిక తమిళ సినిమాల్లో నటిస్తున్న క్రమంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకోకుండా సహా జీవనం చేసారు.పెళ్ళికి ముందే శృతి హాసన్ కడుపులో పడిన సంగతి కూడా మనందరికి తెలిసిందే.

 Sarika Tried To Save Relationship With Kamal Haasan , Kamal Haasan, Sarika, Vani-TeluguStop.com

ఇక అప్పటికే వాణి గణపతి తో పెళ్లి అయ్యి పదేళ్లు అయినప్పటికి సారిక తో ప్రేమ బంధం పెరగడం తో వాణి తో విడాకులు తీసుకొని సారికను పెళ్లి చేసుకున్నాడు.ఇక కమల్ హాసన్ ప్రేమ బాగోతాలు సంగతి మీడియా తో పాటు అందరికి తెలిసిందే.

అయన ఎక్కువ కాలం ఎవరితో కలిసి ఉండలేడు పైగా పెళ్లిపై నాకు నమ్మకం లేదు అంటూ ఎన్నో సార్లు మీడియా ముందు చెప్పాడు.అలాంటి వ్యక్తిని నమ్మి ప్రేమ మరియు పెళ్లి అంటూ రిలేషన్ కొనసాగించడం హీరోయిన్స్ తప్పు కానీ కమల్ తప్పు ఏ రకంగానూ కాదు.

అతడికి ప్రేమ పుట్టడం అది మరొకరి పైకి మళ్లడం వెన్నతో పెట్టిన విద్య.ఇక కమల్ హాసన్ ప్రేమ విషయాలపై ఇప్పటికే ఎన్నో ఆర్టికల్స్ వచ్చిన ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయ్.

ఇక రీసెంట్ గా సారిక తో ప్రేమ, పెళ్లి విడాకుల మరి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.సారిక తో పెళ్ళై 12 యేళ్ళకు సిమ్రాన్ తో మరో మారు ప్రేమలో పడ్డారు.

సిమ్రాన్ కమల్ హాసన్ కి 2000 సంవత్సరంలో తొలిసారి పార్తలే పరవశం అనే స్పీన్మలో నటిస్తున్న సమయంలో తొలిసారి పరిచయం అయ్యింది.అక్కడే వారిద్దరూ ప్రేమలో కూడా పడ్డారు.

అమ్మాయిలను పటాయించడం కమల్ కి పెద్ద విషయం ఏమి కాదు కాబట్టి తొలి సినిమాతోనే ప్రేమలో పడ్డారు.ఆ తర్వాత వరసగా మరో రెండు సినిమాల్లో కూడా కలిసి నటించారు.

Telugu Kamal Haasan, Kollywood, Sarika, Simran, Tollywood, Vani Ganapati-Telugu

ఆ సమయంలో వారి బంధం కూడా గట్టిపడింది.దాంతో ఈ విషయం మీడియా తో పాటు సారిక కూడా తెలిసిపోయింది.వీరి బంధం గురించి సారిక నిలదీస్తే కమల్ అబద్దం ఆడకుండా చెప్పేసాడు.అతడు కమలుడు కాబట్టి ఏది దాచుకోడు.కానీ సారిక అన్ని వదిలేసి అతడితో ప్రయాణం మొదలు పెట్టింది.అందుకే ఆమెకు కమల్ మరియు పిల్లలు తప్ప మరో ప్రపంచం లేదు.

అందుకే కమల్ హాసన్ తో బంధం నిలుపుకోవాలని చాల ప్రయత్నం చేసింది.అయినా అతడిలో మార్పు రాకపోవడం తో ఒకసారి బాల్కనీ నుంచి కిందకు దూకేసింది.

ఆమె స్పైనల్ కాడ్ బాగా దెబ్బ తింది.మూడు నెలలు మంచానికే పరిమితం అయ్యింది.

అయినా కమల్ ఆమె కోసం సిమ్రాన్ ని వదిలేయకపోవడం తో 2004 లో విడాకులు తీసుకొని ఆమె దోవ ఆమె చూసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube