తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్టీయార్ నాగేశ్వర రావు( NTR ,Nageswara Rao ) తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ… ఇండస్ట్రీ లో ఫస్ట్ అనే పదానికి డెఫినిషన్ అంటూ ఉంటే అది ఘట్టమనేని శివరామకృష్ణ( Ghattamaneni Sivaramakrishna ) అనడంలో అతిశయోక్తి లేదు.ఎందుకంటే.
టాలీవుడ్ కు 70 ఎం.ఎం ను, కలర్ స్కోప్ ను, థ్రిల్లర్ సినిమాలను, జేమ్స్ బాండ్ తరహా సినిమాలను మొదట పరిచయం చేసింది ఆయనే.డేరింగ్ అండ్ డ్యాషింగ్ అనే పదానికి కూడా ఈయన్ని డెఫినిషన్ గా చెప్పుకుంటారు.తెలుగు సినిమా రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు.
అప్పట్లో ఏడాదికి 18 సినిమాలు రిలీజ్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణ సొంతం అనడంలో అతిశయోక్తి లేదు.రోజుకు 16 గంటల పాటు పనిచేసేవారు కృష్ణ.
మంచితనానికి నిలువెత్తు నిర్వచనంగా కృష్ణ పేరు చెప్పుకునే వారు.
ఒక సినిమా వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే సగం పారితోషికం వెనక్కి ఇచ్చేసి నెక్స్ట్ సినిమా ఫ్రీగా చేసి పెట్టేవారట.18 రోజుల్లో సినిమాని ఫినిష్ చేసి నిర్మాతల చేతిలో పెట్టేసేవారట… సినిమాకి లాభాలు వచ్చినా నిర్మాత కానీ డిస్ట్రిబ్యూటర్లు( Distributors ) కానీ కృష్ణకి వాటా ఇచ్చేవారు కాదు.కృష్ణ కూడా వాటా ఇవ్వమని అడిగేవారు కాదట.
ఇదిలా ఉండగా.కృష్ణ గారు తన మొదటి భార్య అనుమతితో విజయనిర్మల గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
విజయనిర్మల గారు హీరోయిన్ గానే కాకుండా దర్శకురాలిగా అనేక సినిమాలు చేశారు.అయితే సంపాదన విషయంలో మాత్రం కృష్ణ గారి సంపాదన కంటే విజయనిర్మల గారి ఆస్తే ఎక్కువట.
విజయ నిర్మల గారు చనిపోయే టైంకి ఆమె ఆస్తి అక్షరాలా రూ.2200 కోట్లట.ఆమె మొదటి భర్త తరపున లభించిన ఆస్తితో పాటు సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తి లెక్క 2019 నాటికి అంతయ్యింది.అయితే కృష్ణ గారు చనిపోయే టైంకి కేవలం రూ.700 కోట్ల ఆస్తిని మాత్రమే కలిగి ఉన్నారట.అది మొత్తం తన తదనంతరం కింద తన కొడుకుల సంతానానికి చెందేలా వీలునామా రాయించినట్టు తెలుస్తుంది…
.