నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ).మిస్ శెట్టి మిస్టర్ సినిమా ద్వారా వంటి చేత్తో తన సినిమాని ప్రమోషన్ చేసుకుని హిట్టుగా మలుచుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవచ్చు.
తన పక్కన ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్ గా పని చేసిన అనుష్క ఉన్నప్పటికీ ఈ సినిమాలో తన మార్కును చూపించుకోవడంలో నవీన్ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్ లో కూడా అనుష్క ఎక్కడ పాలు పంచుకోకపోవడంతో మరోమారు నవీన్ తన సత్తా ఏంటో అందరికీ రుజువు చేసుకున్నాడు.
చాలా రోజులుగా అండర్ రేటెడ్ హీరోగా ఉన్నటువంటి నవీన్ పోలిశెట్టి ఇలా సునాయాసంగా హిట్స్ కొట్టుతూ ఉండడం ప్రస్తుతం మిగిలిన స్టార్ హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తున్నాయి.

ఈ సినిమా మాత్రమే కాదు అతడు ఇంతకన్నా ముందు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు( Agent Sai Srinivasa Atreya, Jati Ratnalu ) వంటి సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ చిత్రం హిట్ తో తను హ్యాట్రిక్ ఖాతాలో పడ్డాడు.అయితే కేవలం కామెడీనే తన బలంగా మార్చుకొని ఒకదాని తర్వాత ఒక సినిమాలో నటిస్తూ వస్తున్నాడు నవీన్ మరి ఒక స్టార్ హీరో అవ్వాలంటే కామెడీ సరిపోతుందా? ఆ జోనర్ దాటి బయటకు వస్తే అతడు హిట్టు కొట్టగలడా అని అనుమానాలు కూడా ఉన్నాయి.ఎందుకంటే స్టార్ హీరో అవ్వాలంటే కామెడీ మాత్రమే సరిపోదు కమర్షియల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ సినిమాలు తీయాల్సిందే.

తనకంటూ ఉన్న చిన్న ఫ్యాన్ బెస్ తో ముందుకు వెళ్లడం చాలా కష్టం.మరి కామెడీ అనే జోనర్ దాటి మిగతా హీరోలలాగా ఫ్యానిజం అనే ఒక ఉచ్చులో పడిపోయి మాస్ లేదా కమర్షియల్ సినిమాలు తీసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మరికొన్ని రోజుల పాటు ఎదురు చూస్తే గాని తెలియదు.పైగా ప్రతి సినిమాలోని తాను మాత్రమే లీడ్ రోల్ కాకుండా తనతో సరి సమానంగా మిగతా కమెడియన్స్ కి లేదా హీరోయిన్స్ కి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు తీయడం వల్ల తాను సోలోగా హిట్టు కొట్టగలడా లేదా అని అనుమానాలు కూడా అతను పటాపంచలు చేయాల్సిన అవసరం ఉంది.