జుట్టు పొడుగ్గా సిల్కీగా మరియు షైనీగా మెరిసిపోతూ ఉంటే ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అందుకే అటువంటి జుట్టు కోసం చాలా మంది తెగ ఆరాటపడుతూ ఉంటారు.
ఖరీదైన కేశ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.తరచూ సెలూన్ కి వెళ్లి పలు రకాల హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు.
జుట్టు కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ మాస్క్ తో ఇంట్లోనే సులభంగా లాంగ్, సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను( Long Silky And Shiny Hair ) మీ సొంతం చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక అరటి పండును( Banana ) ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.అలాగే అర కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు( Coconut Milk ) పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloevera Gel ) ఒక ఎగ్ వైట్( Egg White ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ సింపుల్ మాస్క్ ను కనుక వేసుకుంటే బోలెడు ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యంగా ఈ మాస్క్ తో జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.అరటి పండు, కొబ్బరి పాలు, ఎగ్ వైట్, అలోవెరా.ఇవన్నీ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.హెయిర్ ఫాల్ ను అడ్డుకుంటాయి.
అలాగే ఈ మాస్క్ జుట్టును సిల్కీగా మారుస్తుంది.షైనీగా మెరిసేందుకు సహాయపడుతుంది.
వారానికి ఒకసారి ఈ సింపుల్ మాస్క్ ను ప్రయత్నించడం వల్ల హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది.జుట్టు ఆరోగ్యంగా దృఢంగా మారుతుంది.
కాబట్టి, లాంగ్, సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి.