పేరు( Name ) అనేది కేవలం ఒక మనిషికి గుర్తింపు మాత్రమే కాదు అని పండితులు చెబుతున్నారు.మీ పేరులో ఎన్నో అర్ధాలు దాగి ఉంటాయి.
శక్తి, అందం గాంభీర్యన్ని వంటి లక్షణాలను కలుపుకొని పేరు ఉంటుంది.అయితే ప్రతి పేరులోని మొదటి అక్షరం పాత్ర, ఇష్ట ఇష్టాలను, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.
ఇక మీ పేరులోని మొదటి అక్షరం S తో( Letter S ) ప్రారంభమవుతుందా? మరి ఈ అక్షరంతో ప్రారంభమవుతున్న వ్యక్తుల వ్యక్తిత్వం, లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు గల వారు చాలా ఓపెన్ గా స్నేహపూర్వకంగా( Friendly ) ఉంటారు.వీరికి చాలా మంది అభిమానులు ఉంటారు.వీరికి చాలా మంది ఆకర్షితులు కూడా అవుతారు.
ఇక ఎవరైనా ఏదైనా విషయం చెబితే చాలా ఓపికగా ప్రశాంతంగా ఉంటారు.వీరి వల్ల చుట్టుపక్కల ఉన్న వారికి రిలాక్స్ గా, హాయిగా అనిపిస్తుంది.
ఇక ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు గల వారు చాలా రొమాంటిక్ గా( Romantic ) ఉంటారు.అంతే కాకుండా వీరు అన్ని సంబంధాలను చాలా రొమాంటిక్ గా తీసుకుంటారు.

వీరి జీవిత భాగస్వామి పట్ల ప్రేమ, ఆప్యాయంగా ఉండడమే కాకుండా తమ భావాలను కూడా అద్భుతంగా వ్యక్తపరుస్తూ ఉంటారు.మాట ఇస్తే ఎప్పటికీ తప్పరు.వీరి సంబంధాల విషయంలో నిజాయితీగా ఉంటారు.ఈ అక్షరం మొదటిగా ఉన్నవారు ఏ రంగంలో ఉన్నా కూడా టార్గెట్ ను త్వరగా చేరుకుంటారు.స్వతహా కష్టపడి పని చేస్తారు.వీరికి సృజనాత్మక రచనలు, కళాత్మక రంగాల పట్ల ఆసక్తి, ఆకర్షణ ఉంటుంది.
ఈ అక్షరం ఉన్నవారు వారి సమస్యలను వారే పరిష్కరించుకుంటారు.వీరికి చాలా రంగాలు కలిసి వస్తాయి.
డిజైనర్, ఎగ్జిబిషన్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్, ఆర్ట్ డైరెక్టర్, డైరెక్టర్ వంటి రంగాలు వీరికి ఎక్కువగా కలిసి వస్తాయి.