ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.55
సూర్యాస్తమయం: సాయంత్రం.6.51
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: మ.1.30 ల2.00
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
మేషం:
ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి.బంధు మిత్రులతో వివాదాలు తీరుతాయి.వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
వృషభం:
ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.స్ధిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు.
నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి.వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
మిథునం:
ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు.పాత ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు.వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు.స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.
సింహం:
ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.నూతన వస్తు లాభాలు పొందుతారు.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
కన్య:
ఈరోజు మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది.దూరప్రయాణ సూచనలు ఉన్నవి.కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.వ్యాపార ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి.అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు.
తుల:
ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు.ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.
పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.
వృశ్చికం:
ఈరోజు బంధు మిత్రుల మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు.ఇంటాబయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి.ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలున్నవి.ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు:
ఈరోజు సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితులు నుండి కీలక సమాచారం అందుతుంది.నూతన వస్తు లాభాలు పొందుతారు.అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
మకరం:
ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.ప్రశాంతత కోసం దైవదర్శనం చేసుకోవడం మంచిది.వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కుంభం:
ఈరోజు సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పెరుగుతాయి.ధన పరంగా ఒడిదుడుకులు అధికమౌతాయి.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక సమస్యలు కలుగుతాయి.
మీనం:
ఈరోజు మీకు కొన్ని విషయాలు అనుకూలంగా ఉండవు.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనుకోకుండా కొన్ని విజయాలు దక్కుతాయి.కొన్ని సంతోషకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.అనవసరమైన గొడవలకు వెళ్లకపోవడం మంచిది.లేదా దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.