పాదాల నుంచి దుర్వాసన వ‌స్తుందా..? అయితే ఈ చిట్కాలు మీకోస‌మే!

పాదాల నుంచి దుర్వాస‌న రావ‌డం.చాలా మంది త‌ర‌చూ ఫేస్ చేసే స‌మ‌స్యల్లో ఇది ఒక‌టి.

 How To Get Rid Of Smelly Feet? Smelly Feet, Feet,  Home Remedies, Latest News, F-TeluguStop.com

నీటిలో ఎక్కువ సేపు నాన‌డం, దుమ్ము, ధూళి, మృత క‌ణాలు పేరుకు పోవ‌డం, ఎల‌ర్జీ, ఇన్ఫెక్ష‌న్, బ్యాక్టీరియా వంటి కార‌ణాల వ‌ల్ల పాదాల నుంచి చెడు వాస‌న వ‌స్తూ ఉంటుంది.దాంతో బ్యాడ్ స్మెల్‌ను వ‌దిలించుకోవ‌డం కోసం స‌బ్బు పెట్టి పాదాల‌ను ఓ రుద్దేస్తుంటారు.

అయిన‌ప్ప‌టికీ దుర్వాస‌న పోకుంటే ఏం చేయాలో తెలీక తెగ స‌త‌మ‌తం అయిపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను పాటిస్తే చాలా సుల‌భంగా పాదాల నుంచి వ‌చ్చే చెడు వాసన‌ను పోగొట్టుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.

పాదాల నుంచి వ‌చ్చే దుర్వాస‌న‌ను త‌రిమి కొట్ట‌డంలో లావెండర్ ఆయిల్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఒక గిన్నెలో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకుని అందులో పావు స్పూన్ లావెండ‌ర్ ఆయిల్‌ను వేసి మిక్స్ చేయాలి.ఇప్పుడు పాదాల‌ను ఆ నీటిలో కొంత స‌మ‌యం పాటు ఉంచి.

ఆపై నార్మాల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే పాదాల నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది.

అలాగే ఒక గిన్నెలో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, రెండు స్పూన్ల‌ అలోవెర జెల్‌, ఐదు స్పూన్ల నిమ్మ ర‌సం వేసి బాగా క‌ల‌పాలి.ఇప్పుడు పాదాల‌ను ఈ నీటిలో ఐదు నిమిషాల పాటు ఉంచి.

ఆపై నిమ్మ చెక్క‌ల‌తో బాగా రుద్దుకుంటూ పాదాల‌ను శుభ్రం చేసుకోవాలి.త‌ద్వారా పాదాల‌పై మురికి, మృత‌క‌ణాలు, బ్యాక్టీరియా తొల‌గి పోయి వాస‌న రావ‌డం త‌గ్గు ముఖం ప‌డుతుంది.

ఇక ఇవేమి చేయ‌లేమ‌ని అనుకునే వారు.ఉప్పు నీటిని కూడా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.గోరు వెచ్చ‌ని నీటిలో మూడు లేదా నాలుగు స్పూన్ల‌ ఉప్పును క‌లిపి.అందులో పాదాల‌ను ప‌ది నిమిషాల పాటు నాన బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత పాదాల‌ను క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube