తాళి నా మొహాన విసిరికొట్టింది.. 32 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగా.. నటి మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు!

హీరోయిన్ దేవిక.(heroine Devika) చాలామందికి ఈ పేరు గురించి ఆమె గురించి తెలియదు.

 Devika Ex Husband Devadoss About His Wife And Daughter Kanaka, Devika, Ex Husban-TeluguStop.com

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా దాదాపుగా వందకు పైగా సినిమాలలో నటించి మెప్పించింది.

ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.అలా తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ,హిందీ(Telugu, Tamil, Kannada, Malayalam, Hindi) భాషల్లో చాలా సినిమాలలో చాలామంది హీరోల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ అలనాటి అందాల తార.ఇకపోతే దేవిక 1968 లో దర్శకుడు దేవదాసు(Director Devadasu) ను పెళ్లాడింది.ఈ జంటకు పుట్టిన కూతురు కనక కూడా సినిమాల్లో రాణించింది.

కానీ తర్వాత ఈ కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది.

Telugu Kanaka, Devadasu, Devika-Movie

దేవిక వల్ల తన జీవితమే తలకిందులైదంటున్నాడు ఆమె మాజీ భర్త దేవదాసు.దేవిక రీల్‌ లైఫ్‌ లో మాత్రమే నటించలేదని, నిజ జీవితంలోనూ యాక్ట్‌ చేసిందని చెప్తున్నాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవికా మాజీ భర్త ఆమె గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నేను ఎప్పుడూ దేవిక వెంట పడలేదు.

తనే పెళ్లి చేసుకోమని ప్రపోజల్ చేసింది.నాకు మీకు సెట్ అవ్వదండి అని చెప్పాను అయినా కూడా తను వినలేదు నా కాళ్ళ మీద పడి పెళ్లి చేసుకోమని బ్రతిమలాడింది.

ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది.అలా తిరుపతిలో పెళ్లి చేసుకున్నాము.

కానీ తనది నిజమైన ప్రేమ కాదని నెమ్మదిగా అర్థమైంది.నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు తన దగ్గర పైసా లేదు.

డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుంది.

Telugu Kanaka, Devadasu, Devika-Movie

నేను పెద్ద డైరెక్టర్‌ అయిపోతానని దేవిక అనుకుంది.నన్ను తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూసింది.కానీ నేను స్వతంత్ర భావాలు ఉన్న వ్యక్తిని.

నాకు నచ్చినట్లుగానే ఉండేవాడిని.దీంతో ఆమె నన్ను మనిషిగా చూసేది కాదు.

ఒకరోజు తాళిబొట్టు (Talibottu)విసిరి నా మొహాన కొట్టింది.నన్ను చంపించాలని కూడా ట్రై చేసింది.

అందుకోసం మనుషుల్ని కూడా పంపింది.అప్పుడు నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను అంటూ సంచలన విషయాలను బయట పెట్టారు.

నేను, దేవిక 32 ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగాము.ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది.

దేవిక తల్లి చనిపోయేటప్పుడు వీలునామా రాయలేదు.అప్పుడు దేవిక తన తల్లి సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి తనపై రాసుకుంది.

అది నేను పసిగట్టాను.తనకు చెన్నైలో ఒక ఇల్లుతో పాటు 25 ఎకరాల భూమి ఉండేది.

మాకు కూతురు కనక పుట్టింది కదా అది కూడా దేవికకు ఇష్టం లేదు.కానీ విడాకులు అయ్యే సమయానికి కోర్టు కూతుర్ని తల్లికే అప్పగిస్తుందిగా అలా దేవిక కనకను తీసుకెళ్లింది.

తన మనసును మార్చేసింది.నా కూతురి దృష్టిలో నన్ను చెడ్డవాడిగా చిత్రీకరించింది.

తను నాపై వేసిన నిందలకు అందరూ నన్ను శత్రువుగా చూశారు.అందుకే దేవిక చనిపోయినప్పుడు కూడా తనను చూసేందుకు వెళ్లలేదు.

తల్లిలాగే కూతురు తయారైంది.ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు తనదేనని కనక నాపై కేసు పెట్టింది.

తల్లిలాగే తనూ ఫోర్జరీ సంతకంతో ఈ ఇంటిని లాక్కోవాలని చూసింది.అది ఫోర్జరీ అని కోర్టులో తేలితే ఎనిమిదేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని కాంప్రమైజ్‌ కు వచ్చింది అని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube