నాగార్జున అనగానే మన్మథుడు, గ్రీకు వీరుడు, కింగ్ ఆఫ్ రొమాన్స్, హ్యాండ్సమ్, అందగాడు అని చాలా చెప్తారు.తెలుగు సినిమా రంగంలో అక్కినేని నాగేశ్వర్ రావు పేరును నిలబెడుతూ.
తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు నాగార్జున.అంతేకాదు తనకంటూ కొంత ఇమేజ్ ని తయారు చేసుకున్నాడు.
అయితే చిరంజీవి, బాలక్రిష్ణ, వెంకటేష్ లాంటి టాప్ హీరోలు మాస్ సినిమాలతో దూసుకుపోయినా.నాగార్జున ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశాడు.
నాగార్జునలా మరే హీరో ఇలాంటి రోల్స్ చేయలేదు.భక్తి, మాస్, క్లాస్, యాక్షన్ సహా పలు సినిమాలు చేశాడు.ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్లు చేశాడు.విజయం, పరాజయంతో సంబంధం లేకుండా తన పంథా కొనసాగిస్తున్నాడు.
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం నటులు వచ్చినా కూడా ఆయన ఇదే తరహాలో ముందుకు వెళ్తున్నాడు.ఇంతకీ ఆయన పోషించిన డిఫరెంట్ క్యారెక్టర్లు ఏంటో ఓసారి చూద్దాం.
క్రిష్ణుడు

క్రిష్ణార్జున సినిమాలో సినిమాలో శ్రీక్రిష్ణుడి పాత్ర పోషించాడు.అందరి చేత వారెవ్వా అనిపించాడు.
మేజర్ రవీంద్ర

హైజాక్ అయిన విమానం నుంచి ప్రయాణికులను తరలించే మేజర్ రవీంద్ర పాత్రలో అద్బుత నటన కనబరిచాడు.
రాజన్న

తెలంగాణలో దొరల దారుణాలను ఎదిరించిన రాజన్నగా అద్భుత క్యారెక్టర్ చేశాడు.
సాయిబాబ

శిరిడి సాయి సినిమాలో సాయిబాబాగా ఆకట్టుకున్నాడు.
చండాలుడు

జగద్గురు ఆది శంకర సినిమాలో చండాలుడి పాత్ర చేసి మెప్పించాడు.
విక్రమాదిత్య

ఊపిరి సినిమాలో కాళ్లు చేతులు పడిపోయిన వ్యక్తిగా విక్రమాదిత్య క్యారెక్టర్ చేశాడు.