ప్రముఖ నటి హేమ సినిమాలకు గుడ్ బై చెప్పిందా.. అలాంటి రోల్ వచ్చినా నటించనంటూ?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ( Actress Character Artist Hema ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో సినిమాలలో నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హేమ.

 Actress Hema Respond Not Acting Recent, Hema, Acting, Tollywood, Stop Acting-TeluguStop.com

దాదాపు 10 15 ఏళ్ల క్రితం వరకు వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపిన హేమ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.ఈమె సినిమాలలో నటించి చాలా కాలం అయ్యిందని చెప్పాలి.

సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

Telugu Actresshema, Hema, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక షాపింగ్ మాల్ ( Shopping mall )ఓపెనింగ్ లో కనిపించింది హేమ.ఈ సందర్భంగా ఆమెకు యాక్టింగ్ కి సంబంధించిన ప్రశ్న ఎదురవగా యాక్టింగ్ మానేశానని తెలిపింది.అంతేకాకుండా బాహుబలి లో శివగామిని లాంటి పాత్ర ఇచ్చిన సరే చేయను అని క్లారిటీ ఇచ్చేసింది హేమ.ఈ సందర్భంగా హేమా మాట్లాడుతూ.నేను సినిమాల్లో నటించడం మానేశాను.

ఇప్పుడు చిల్ అవుతున్నాను.హ్యాపీగా ఉన్నాను.

జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. 14 ఏళ్లప్పటి నుంచి కష్టపడుతున్నాను.

ఇక చాలు.ఇంకెంత కాలం కష్టపడాలి? ఎవరికోసం కష్టపడాలి.

Telugu Actresshema, Hema, Tollywood-Movie

నేను నా కోసం హ్యాపీగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను.నన్ను నేను ప్రేమించుకుంటున్నాను.బోర్ కొట్టి యాక్ట్ చేయాలనిపిస్తే అప్పుడు చూస్తాను.ఇప్పటికైతే శివగామి లాంటి పాత్ర ఇచ్చినా సరే నటించను.అంత ఇంట్రెస్ట్ లేదు అని హేమ చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా హేమ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చిన్నప్పటినుంచి సినిమాలలో నటించడం మొదలుపెట్టిన హేమ ఇప్పటివరకు దాదాపు ఏకంగా 400 సినిమాల వరకు నటించింది. తెలుగు తో పాటుగా తమిళ హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.

అప్పుడప్పుడు కాంట్రవర్సీ విషయాల్లో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది హేమ.ముఖ్యంగా బెంగళూరు రేవ్ పార్టీ సమయంలో హేమ పేరు ఒక రేంజ్ లో మారుమోగిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube