Venu : హీరో వేణు కెరియర్ పాడవడానికి అశ్వినీదత్ కి ఉన్న సంబంధం ఏంటి?

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.వాటి వల్ల కొందరి తలరాతలే మారిపోతుంటాయి.

 Hero Venu Problems With Ashwini Dath-TeluguStop.com

మొదటి సినిమా హిట్టు పడ్డ తర్వాత రెండవ సినిమా సెలక్షన్లో కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు.ఇక ఒక్కోసారి అయితే మొహమాటానికి పోయి కూడా కొంత మంది హీరోలు తమ కెరియర్ ను పోగొట్టుకుంటారు.

అలాంటి హీరోల్లో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి తొట్టెంపూడి వేణు.పుష్కరమైన టాలెంట్ ఉన్న హీరో వేణు ( Venu )మొట్ట మొదటి సినిమా చిరునవ్వుతో( chirunavvu ) .175 రోజులు అనేక సెంటర్స్ లో ఆడి మంచి విజయాన్ని సాధించింది.అయితే ఈ సినిమా విజయం సాధించిన తర్వాత పెరుగుతుంది అని అంతా భావించారు.

Telugu Ashwini Dath, Ashwinidat, Chirunavvu, Venu, Tollywood, Venu Problems-Telu

అందరూ ఊహించినట్టుగా కాకుండా ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన డౌన్ ఫాల్ చూడాల్సి వచ్చింది తర్వాత కొన్ని రోజులకు వేణు తెర నుంచి కనుమరుగై పోయాడు.కానీ ఇటీవల కాలంలో మళ్ళీ వేణు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.కొన్ని మంచి సబ్జెక్ట్స్ వింటున్నాడు అలాగే మంచి చిత్రాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.అయితే వేణు కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడానికి గల కారణాలు చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది.

చిరునవ్వుతో విజయం సాధించిన తర్వాత వేణు దగ్గరికి అశ్వినిదత్, ఈవీవీ సత్యనారాయణ ( Ashwinidat, EVV Satyanarayana )ఒక ప్రాజెక్టుతో వచ్చారు.కథ చాలా బాగుండడంతో వేణు కూడా ఒప్పుకున్నాడు అయితే అది జరిగిన రెండు రోజుల తర్వాత రవితేజ హీరోగా నటించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథను పూరి జగన్నాథ్ వినిపించాడు.

ఆ సబ్జెక్ట్ బాగా నచ్చడంతో వేణు అశ్విని దత్ పర్మిషన్ అడిగాడు కానీ అందుకు దత్తు గారు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నాడు.

Telugu Ashwini Dath, Ashwinidat, Chirunavvu, Venu, Tollywood, Venu Problems-Telu

ఇది కొన్నాళ్ళకు అశ్విని దత్తు కూడా అనుకున్న ప్రకారం కాకుండా ప్రాజెక్ట్ చేయకుండా పక్కకు తప్పుకోవడంతో వేణు కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది.అయితే ఈమె సత్యనారాయణ సినిమా చేయాలని ముందుకు రావడంతో వేణు కాస్త సంబరపడ్డాడు.తెల్లవారితే మూవీ కి కొబ్బరికాయ కొడతారు అనగా ముందు రోజు కథ మార్చి వీడెవడండీ బాబు అనే సినిమా కథ చెప్పాడట.

వేణు ఆ సినిమా మొహమాటం కొద్ది చేయడంతో అది కాస్త ఫ్లాప్ అయింది.ఇక ఆ తర్వాత కూడా ఇలాంటి అనేక సంఘటనలు వేణుని కోలుకోకుండా చేశాయి.

కృష్ణవంశీ తీసిన ఖడ్గం సినిమాలో కూడా రవితేజ పాత్రకు ముందుగా వేణుని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కూడా చేయలేకపోయాడు.ఈ రెండు సినిమాలు గనక చేసి ఉంటే ఈ రోజు స్టార్ హీరోగా ఉండేవాడు వేణు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube