ప‌చ్చి బొప్పాయిని ఈ విధంగా తీసుకుంటే ఊహించ‌ని ఆరోగ్య లాభాలు మీసొంతం!

బొప్పాయి పండును ఇష్టపడని వారు ఉండరు.పెద్దలే కాదు పిల్లలు సైతం బొప్పాయి పండును ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు.

 Unexpected Health Benefits Of Consuming Raw Papaya In This Way Are Yours! Health-TeluguStop.com

బొప్పాయి పండు రుచిగా ఉండ‌ట‌మే కాదు బోలెడ‌న్ని పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉంటుంది.అందుకే ఆరోగ్య ప‌రంగా ఇది ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

అయితే బొప్పాయి పండే కాదు పచ్చి బొప్పాయి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా పచ్చి బొప్పాయిను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మీరు ఊహించని ఎన్నో ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం పచ్చి బొప్పాయిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక‌ పచ్చి బొప్పాయిని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పై తొక్కను చెక్కెయ్యాలి.

ఆ తర్వాత బొప్పాయిని సన్నగా తురుముకుని పెట్టుకోవాలి.అలాగే ఒక దానిమ్మ పండును తీసుకుని లోపల ఉండే గింజలు వేరు చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌ను తీసుకొని అందులో బొప్పాయి తురుము, దానిమ్మ గింజలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే అందులో స‌న్న‌గా త‌రిగిన‌ గుప్పెడు కొత్తిమీర, వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, వన్ టేబుల్ స్పూన్ నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్లు వేడి చేసిన నువ్వుల నూనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే పచ్చి బొప్పాయి స‌లాడ్ సిద్ధం అవుతుంది.

ఈ సలాడ్ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ స‌లాడ్ ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల‌ గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.అధిక బ‌రువు స‌మ‌స్య దూరం అవుతుంది.పలు రకాల క్యాన్సర్లు వచ్చే ప్ర‌మాదం తగ్గుతుంది.ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.

మరియు రక్తంలో చక్కెర స్థాయిలు సైతం కంట్రోల్ తప్పకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube