ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందిన యాక్షన్ హారర్ మూవీ జాంబిరెడ్డి ఫిబ్రవరి 5వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నది.ఈ సినిమాలో ఇంద్ర ఫేమ్ సత్య తేజ హీరోగా నటించగా.
ఆనంది హీరోయిన్ గా నటించారు.ఫిబ్రవరి 5న ప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ స్కిట్ లో కూడా జాంబిరెడ్డి టీం కనిపించనుంది.
ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో జాంబిరెడ్డి మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన చిత్ర బృందాన్ని చూడొచ్చు.ఈ చిత్రంలో గెటప్ శీను కూడా నటించాడు.
అయితే ఈ సినిమాలోని హీరోయిన్ ఆనంది 8-9 సంవత్సరాల తర్వాత మళ్లీ తెలుగు తెరపై మెరవనున్నారు.ఈరోజుల్లో, బస్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, నాయక్ వంటి తెలుగు సినిమాల్లో నటించిన ఆనంది పక్క మన తెలుగు అమ్మాయే.
తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లాకి చెందిన ఆనంది అసలు పేరు రక్షిత.అప్పట్లో తన పేరుని హాసిక అని మార్చుకున్నారు.
ఆ పేరు కలిసి రాక తన పేరును ఆనందిగా మార్చుకున్నారు.
ఇకపోతే బస్ట్ స్టాప్(2012) మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైన ఆమె తెలుగులో ఒకటి అరా సినిమాల్లో నటించారు కానీ ఆ తర్వాత అవకాశాలు దొరక్క తమిళ ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు.
టాలీవుడ్ దర్శకనిర్మాతలు మన తెలుగు హీరోయిన్లను పక్కనపెట్టి ప్లాస్టిక్ హావభావాలు పలికించే ముంబై ముద్దుగుమ్మలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని ప్రత్యేకంగా చెప్పకర్లేదు.ఇందుకు కారణం ముంబై హీరోయిన్లు దర్శక నిర్మాతలు చెప్పినట్టు వినటమే అని అంటుంటారు.
కమిట్ మెంట్స్ కి కూడా ముంబై ముద్దుగుమ్మలు ఓకే చెబుతారని.అందుకే వారికి ఎక్కువగా అవకాశాలు వస్తాయని చెబుతుంటారు.

ఏది ఏమైనా అందం, అభినయం ఉన్న తెలుగు హీరోయిన్లకు తెలుగు సినిమాల్లో అవకాశాలు రాక ఎంతోకాలం అవుతుంది.ఆనంది తెలుగు అమ్మాయి అయినందున టాలెంట్ ఉన్నా కూడా ఆమెకు టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రాలేదు.దీనితో 2014 లో కోలీవుడ్ ఇండస్ట్రీ లో తెరంగేట్రం చేసిన ఆనంది ఇప్పటివరకు 19 సినిమాల్లో నటించి మంచి నటీమణి గా గుర్తింపు తెచ్చుకున్నారు.ముఖ్యంగా పరియరం పెరుమాల్ సినిమాలో అద్భుతమైన నటనా ప్రతిభ ను చూపించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నారు.
ఆ తర్వాత మళ్లీ ఆమె జాంబి రెడ్డి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఆమెకు తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ లోనే మంచి గుర్తింపు దక్కించుకోవాలని ఉంది కానీ అవకాశాలు ఎవరూ ఇవ్వడం లేదు.
ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ జాంబి రెడ్డి సినిమాలో అవకాశం ఇచ్చారు.దీనితో కొద్దిపాటి పాపులారిటీ మళ్ళీ వస్తోంది.

అయితే ఈ సినిమా కంటే ముందుగా ఆమె పేరు ఇటీవల తెలుగు వార్తల్లో వినిపించింది.వరంగల్ జిల్లాలో రహస్యంగా తమిళ కో డైరెక్టర్ సోక్రటీస్ ను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె పేరు మీడియాలో వినిపించింది.అయితే యూట్యూబ్ ఛానల్ లలో, చిన్నపాటి పత్రికల్లో మాత్రమే ఆమె పేరు వినిపించింది తప్ప పెద్ద పత్రికల్లో ఆమె పేరు కనిపించిన పాపాన పోలేదు.ఏదేమైనా జాంబి రెడ్డి సినిమా సూపర్ హిట్ అయితే మళ్లీ ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై అంచనాలను భారీస్థాయి కి తీసుకెళ్ళింది.మొదటిసారిగా సరికొత్త జోనర్ లో తెలుగులో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.