రేగి పండ్లు( Plum ) తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.ముఖ్యంగా రక్తహీనత సమస్యను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.
అయితే రేగి పండ్లను తీసుకోవడం వలన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.రేగిపండ్లను తీసుకోవడం వలన మధుమేహా వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి.
ఎందుకంటే రేగి పండ్లు తీసుకోవడం వలన రక్తంలో చక్కెర శాతం కంట్రోల్ అవుతుంది.ఇక రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు కూడా రేగి పండ్లు తీసుకుంటే రక్తహీనత( Anemia ) సమస్య తగ్గుతుంది.
అంతేకాకుండా రేగి పండ్లను తీసుకోవడం వలన ఇందులో ఉండే కాల్షియం పోషకాలు అంది ఎముకలు దృఢంగా మారుతాయి.రేగి పండ్లను తీసుకోవడం వలన రుచితో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.రేగి పండ్లలో కేవలం పోషకాలు నిండి ఉండడంతో ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి.ఇక రేగి పండ్లను తీసుకోవడం వలన ఎన్నో జీర్ణ సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.
జీర్ణ సమస్యల( Digestive problems )తో బాధపడుతున్న వారు, మలబద్ధకంతో బాధపడుతున్న వారు రేగిపండ్లను తీసుకుంటే ఈ సమస్యలు తగ్గిపోతాయి.
ఇక చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు.అలాంటివారు రేగి పండ్లను తీసుకుంటే అధిక బరువు సమస్యతో ఉపశమనం పొందవచ్చు.ఇక కడుపు మంట, గొంతు నొప్పి, కండరాల నొప్పి లాంటి సమస్యలు ఉన్నవారు కూడా రేగి పండ్లను తీసుకుంటే ఈ సమస్యలన్నీ తగ్గుముఖం అవుతాయి.
రేగి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఏ ఉండడంతో ఈ పోషకాల లోపం ఉన్నవారు ఈ రేగి పండ్లు తీసుకోవడం వలన విటమిన్ సమస్య తగ్గుతుంది.ఈ విధంగా ఈ సీజన్లో లభించే రేగి పండ్లను తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.