కిడ్నీ స్టోన్స్ లేదా మూత్రపిండాల్లో రాళ్లు. ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కోట్ల మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు.బొడ్డు, వీపు భాగంలో తీవ్రమైన నొప్పి, తరచూ జ్వరం రావడం, అధిక చలి, వికారం, మూత్ర విసర్జన సమయంలో మంట మరియు భరించలేనంత నొప్పి పుట్టడం ఇలా ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి.
వీటిని నిర్లక్ష్యం చేస్తే రాళ్లు మరింత ముదిరిపోతాయి.దాంతో ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
అందుకే ఏ మాత్రం లైట్ తీసుకోకుండా కిడ్నీ స్టోన్స్‌ను ముందుగానే కరిగించుకోవాలి.అయితే కొన్ని కొన్ని ఆహారాలు కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
అలాంటి వాటిలో బార్లీ వాటర్ కూడా ఉంది.అవును, కిడ్నీలో రాళ్లు ఉన్న వారు ప్రతి రోజు ఒక గ్లాస్ బార్లీ వాటర్ తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు క్రమంగా కరుగుతాయి.అలాగే మూత్ర పిండాల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఏర్పడినా.
తగ్గిపోతుంది.మూత్ర సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి.
మరి ఇంతకీ బార్లీ వాటర్ ఎలా తయారు చేయాలీ అంటే.

ముందుగా రెండు గ్లాసులో వాటర్‌ను తీసుకుని అందులో రెండు స్పూన్ల బార్లీ గింజలను వేసి బాగా మరిగిస్తే.బార్లీ గింజలు మెత్తగా మారి పోషకాలన్నీ నీటిలోకి దిగుతాయి.ఇప్పడు వాటర్‌ను వడబోసి.
అందులో కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేసి తీసుకోవాలి.
ఈ బార్లీ వాటర్ రెగ్యులర్‌గా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ పోవడం మాత్రమే కాదు.
వెయిట్ లాస్ అవుతాయి.బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
వేసవిలో వడ దెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది.వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది.
జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.రక్త పోటు స్థిరంగా ఉంటుంది.
కాబట్టి, కిడ్నీలో రాళ్లు ఉన్న వారే కాదు.అందరూ బార్టీ వాటర్ సేవించవచ్చు.