ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెట్టింగ్ యాప్( Betting Apps ) వ్యవహారం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారం ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది.
ఇప్పటికే ఈ విషయంలో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.అయితే కొంతమంది తప్పును ఒప్పుకుంటూ సోషల్ మీడియా వేదికగా వీడియోలు విడుదల చేసినప్పటికీ పోలీసులు మాత్రం అసలు విడిచి పెట్టేది లేదు అంటున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయంలో యాంకర్ విష్ణుప్రియ( Anchor Vishnu Priya ) కు భారీగా షాక్ తగిలింది.బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) తేల్చి చెప్పింది.బెట్టింగ్ యాప్స్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విష్ణు ప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఆ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
విచారణ సమయంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విష్ణు ప్రియకు ముందుస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది.విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

కాగా బెట్టింగ్ యాప్ వివాదంలో తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై కేసులు నమోదు చేశారు.విచారిస్తున్నారు.వారిలో విష్ణు ప్రియా సైతం ఉన్నారు.అయితే ఈ వివాదంలో విష్ణుప్రియ మార్చి 20 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు.ఈ తరుణంలో విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ముందుస్తు బెయిల్ కావాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ విషయంపై సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు.ఈ రోజు ఆమె పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఎఫ్ఐఆర్ ను రద్దు చేయడానికి దర్యాప్తును నిలిపివేయడానికి హైకోర్టు తిరస్కరించింది.
అదే సమయంలో ఈ కేసులో పోలీసులతో సహకరించాలని విష్ణుప్రియకు హైకోర్టు సూచించింది.ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది