కాలిఫోర్నియా వీధుల్లో సడన్ సర్‌ప్రైజ్.. మస్క్ AI వాయిస్‌తో అవాక్కైన జనం!

కాలిఫోర్నియాలోని( California ) కొన్ని ప్రాంతాల్లో పాదచారులు( Pedestrians ) క్రాస్‌వాక్ సిగ్నల్స్ నుంచి వింత శబ్దాలు వినిపించి ఒక్కసారిగా షాక్ అయ్యారు.అలమేడా, ఓక్లాండ్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో, సిగ్నల్స్ అనుకోకుండా ఎలాన్ మస్క్,( Elon Musk ) మార్క్ జుకర్‌బర్గ్( Mark Zuckerberg ) వాయిస్‌లతో కూడిన ఆడియోను ప్లే చేయడం మొదలుపెట్టాయి.

 కాలిఫోర్నియా వీధుల్లో సడన్ స-TeluguStop.com

వైరల్ వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది.జనం రోడ్డు దాటుతుంటే చాలు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ గొంతుకలు వినిపించాయి.అచ్చం వాళ్ల వాయిస్‌ల్లానే ఉన్నాయి కానీ ఎవరో టెక్ హ్యాకర్లు డీప్‌ఫేక్ టెక్నాలజీ వాడి, క్రాసింగ్ సిగ్నల్స్‌లోకి ఈ వాయిస్‌లను చొప్పించారట.దీంతో జనం ఒక్కసారిగా షాకయ్యారు.

ఈ చిలిపి పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మస్క్ వాయిస్( Musk Voice ) అయితే మొదట్లో ఫన్నీగా అనిపించినా, తర్వాత వింతగా ఎమోషనల్‌గా మారిపోయింది.

ఏమందో తెలుసా? “హాయ్, నేను ఎలాన్ మస్క్‌ని.డబ్బుతో సంతోషం కొనలేమంటారు.

నిజమేనేమో.నేనైతే ట్రై చేశా.

కానీ సైబర్‌ట్రక్ కొనొచ్చుగా, అదిరిపోద్ది కదా? నో, ఎంత ఒంటరినో కదా నేను” అంటూ ముగించేశాడు.నవ్వాలో ఏడ్వాలో తెలీకుండా జనం షాక్ తిన్నారు.

జుకర్‌బర్గ్ వాయిస్ అయితే మరీ దారుణం.రోబోలా భయపెట్టేలా ఉంది.“హాయ్, నేను మార్క్ జుకర్‌బర్గ్. నన్ను ముద్దుగా జుక్ అని కూడా పిలుస్తారు తెలుసా? మీ జీవితంలోకి AIని బలవంతంగా చొప్పిస్తుంటే మీకు ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉండటం సహజం.కానీ మీరు వర్రీ అవ్వక్కర్లేదు.ఎందుకంటే దీన్ని ఆపడానికి మీరేం చేయలేరు.హాహా” అంటూ నవ్వేశాడు.జుకర్‌బర్గ్ వాయిస్ వింటే వెన్నులో వణుకు పుట్టేలా ఉంది అంటున్నారు జనం.

జుకర్‌బర్గ్ సైలెంట్‌గా ఉన్నా, మస్క్ మాత్రం ఈ వీడియోని తన ఎక్స్‌ అకౌంట్‌లో నవ్వుతున్న ఎమోజీతో షేర్ చేశాడు.దాంతో వీడియోకి 2 కోట్ల వ్యూస్ వచ్చాయంటే మామూలు విషయం కాదు.ఇదంతా చేసింది ఎవరు అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.ప్రస్తుతానికి ఆ క్రాస్‌వాక్ సిస్టమ్స్‌ని మూసేశారు.ఏ గ్రూపూ ఈ పని చేసినట్టు ఒప్పుకోలేదు.దర్యాప్తు మాత్రం ఇంకా జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube