బరువు తగ్గాలని భావిస్తున్నారా.. అయితే వెంటనే ఇది తెలుసుకోండి!

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది అధిక బరువు( Over Weight ) సమస్యతో బాధపడుతున్నారు.ఓవర్ వెయిట్ కారణంగా వివిధ జబ్బులు వచ్చే రిస్క్ పెరగడమే కాకుండా శరీర ఆకృతి పూర్తిగా దెబ్బతింటుంది.

 This Drink Helps To Lose Weight Very Effectively Details, Garlic Lemon Water, W-TeluguStop.com

బాడీ షేప్ అవుట్ అవ్వడం వల్ల ఇత‌రులు చేసే బాడీ షేమింగ్ కామెంట్స్ మరింత ఆందోళనకు గురి చేస్తాయి.ఈ క్రమంలోనే బ‌రువు తగ్గాలని( Weight Loss ) భావిస్తుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

Telugu Effective, Garlic, Garlic Lemon, Tips, Healthy, Latest, Lemon-Telugu Heal

అందుకోసం ముందుగా ఒక నిమ్మ పండును( Lemon ) తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు( Garlic ) శుభ్రంగా పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మరియు నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి.వీటితోపాటు హాఫ్ టీ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము తురుము వేసి దాదాపు ఐదారు నిమిషాల పాటు మరిగి‌స్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.

Telugu Effective, Garlic, Garlic Lemon, Tips, Healthy, Latest, Lemon-Telugu Heal

వెల్లుల్లి నిమ్మ నీరును( Garlic Lemon Water ) రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే అద్భుత ఫలితాలు పొందుతారు.ఈ డ్రింక్ శరీర మెటబాలిజం రేటును పెంచుతుంది.ఇది కేలరీలను మరింత వేగంగా కరిగించి వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.కాబట్టి బరువు తగ్గాలని భావిస్తున్న వారు తప్పకుండా ఈ డ్రింక్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

పైగా ఈ డ్రింక్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి మరియు ఈ డ్రింక్  మలినాలను తొలగించి బాడీని డీటాక్స్ సైతం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube