మార్చి నెల స్టార్ట్ అయిందో లేదో ఎండలు మంట పుట్టించేస్తున్నాయి.ఈ ఎండల్లో బయట కాలు పెడితే చాలు చర్మం ఎర్రగా కమిలి పోతుంటుంది.
అయితే కమిలిన చర్మాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో తెలీక చాలా మంది తెగ మదన పడిపోతూ ఉంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ అండ్ సింపుల్ రెమెడీని ట్రై చేస్తే గనుక ఎంతో సులభంగా ఈ సమస్యను నివారించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.? తెలుసుకుందాం పదండీ.
ముందుగా బాగా పండిన ఒక టమాటోను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
బ్లెండర్‌లో కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు, మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని.జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల తులసి ఆకుల జ్యూస్, రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.

అనంతరం నార్మల్ వాటర్‌తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని.ఐస్ క్యూబ్స్‌తో స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.ఇలా చేస్తే గనుక ఎండ వల్ల కమిలిన చర్మం మళ్లీ ఇట్టే మామూలు స్థితికి వచ్చేస్తుంది.
ఇక ఈ రెమెడీతో పాటు కొన్ని ముందు జాగ్రత్తలు కూడా పాటిస్తే చర్మానికి ఇంకా మంచిది.
అవేంటంటే.బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా సన్‌స్క్రీన్ లోషన్‌ను అప్లై చేసుకోవాలి.
ఎండ తగలకుండా చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులను ధరించాలి.వాటర్‌తో పాటు కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూసులు, మజ్జిగ వంటివి తాగుతుండాలి.
మరియు రోజుకు రెండు లేదా మూడు సార్లు ముఖాన్ని కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.