చాలామంది తమిళ హీరోలు( Tamil heroes ) తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకుని ఇక్కడ కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలను సంపాదించుకున్నారు.రజనీకాంత్, కమల్‌హాసన్ లాంటివారికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండగా.
విజయ్, సూర్య, కార్తీ( Vijay, Surya, Karthi ) లాంటి సీనియర్ హీరోలతో పాటు చాలామంది యంగ్ తమిళ హీరోల సినిమాలు తెలుగులోనూ విడుదల అవుతున్నాయి.ఇక్కడ కూడా వారి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తున్నాయి.
దీంతో తమిళ హీరోలకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉంటున్నారు.కంటెంట్ బాగుంటే, సినిమాలో ఏదైనా కొత్తదనం ఉండే ఏ హీరో సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు.
తమిళ హీరోలు విభిన్న స్టోరీలతో బాక్సాఫీస్ ముందుకు వస్తారు.దీంతో వారి సినిమాలకు టాలీవుడ్ లోనూ క్రేజ్ ఉంటుంది.
అయితే తమిళ హీరోలు సూర్య( surya ),.కార్తీల తండ్రి శివకుమార్ తమిళంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.కానీ అందరి నటులలాగా ఆయన తెలుగులోకి అడుగుపెట్టలేకపోయారు.సింధుభైరవి, విచిత్రపెళ్లాం లాంటి డబ్బింగ్ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులు ఆయన నటను చూశారు.అలాగే పిన్ని, శివమయ్య లాంటి సీరియల్స్‌లలో నటించి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.ఇక తమిళ రచయిత ఇందిరా పార్థసారథి రాసిన ఉచ్చి వెయిల్ నవల ఆధరంగా మరుపక్కం అనే సినిమాను కేఎస్ సేతుమాధవన్ తమిళంలో తెరకకెక్కించారు.
ఈ సినిమాలో శివకుమార్, రాధ, జయభారతి( Sivakumar, Radha, Jayabharathi ) ప్రధాన పాత్రలు పోషించారు.

ఎన్‌ఎఫ్‌డీసీ, దూరదర్శన్( NFDC, Doordarshan ) సంయక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.ఇందులో ఆచారాల కోసం ప్రేమించిన భార్యను దూరం చేసుకున్న ఓ బ్రాహ్మణుడి పాత్రలో శివకుమార్ అద్భుతంగా నటించారు.ఈ సినిమాకు గాను శివకుమార్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభిస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ అగ్నిపథ్ సినిమాకు గాను అమిత్ బచ్చన్ కు ఉత్తమ నటుడిగా ఆ సంవత్సరం జాతీయ అవార్డు లభించింది.అయితే జాతీయ ఉత్తమ చిత్రంగా మరుపక్కంకు అవార్డు లభించింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించే అవార్డుల్లో అయినా శివకుమార్ కు ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు.కానీ రాష్ట్ర స్థాయి అవార్డులలోనూ నిరాశ ఎదురైంది.శివకుమార్ తో పాటు ఆ సినిమాకు కూడా ఎలాంటి అవార్డు లభించలేదు.అయితే తండ్రి శివకుమార్‌కు చేజారిన జాతీయ పురస్కారం 32 ఏళ్ల తర్వాత ఆయన హీరో సూర్య అందుకోవడం విశేషం.
అంతేకాకుండా ఉత్తమ నిర్మాతగా ఆయన కోడలు జ్యోతిక కూడా పురస్కారం అందుకుంది.







