పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇష్టంగా తినే కూర కాయల్లో బంగాళదుంప ముందు వరుసలో ఉంటుంది.బంగాళదుంపతో రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు.
బంగాళదుంప( Potato )తో ఏ డిష్ చేసిన రుచి మాత్రం అదిరిపోతుందనే చెప్పాలి.అయితే మధుమేహం ఉన్నవారు బంగాళదుంప తినకూడదని చాలామంది నమ్ముతుంటారు.
బంగాళదుంపలు తింటే షుగర్ లెవర్స్ పెరిగిపోతాయని భావిస్తుంటారు.కానీ నిజానికి మధుమేహం ఉన్నవారు నిశ్చింతగా బంగాళదుంప తినవచ్చు.
అయితే మితంగా తినాలి.అలాగే బంగాళదుంప తినేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి.
ఆ నియమాలు ఏంటి.? ఎందుకు పాటించాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళదుంపల్లో పిండి పదార్థాలే కాదు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.ఇది మిమ్మల్ని ఎక్కువ కాలం పాటు సంపూర్ణంగా ఉంచుతుంది.అలాగే బంగాళదుంపలో జింక్, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి మరియు విటమిన్ సి వంటి పోషకాలు నిండి ఉంటాయి.
అధిక మెగ్నీషియం మరియు ఫైబర్ కంటెంట్ ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడతాయి.కాబట్టి మధుమేహం ఉన్నవారు మితంగా బంగాళదుంపను తినొచ్చు.
అధికంగా తింటే మాత్రం టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.ఒకవేళ ఇప్పటికే మధుమేహం ఉంటే.వారిపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.అలాగే బంగాళదుంపును మధుమేహం ఉన్నవారు ఎలా పడితే అలా తినకూడదు.బంగాళదుంపను ఉడికించి లేదా కాల్చి తినాలి.బీన్స్ వంటి ఇతర ఫైబర్-రిచ్ కూరగాయలతో బంగాళాదుంపలను తీసుకుంటే ఇంకా మంచిది.
వేయించిన బంగాళాదుంపలు మరియు బంగాళాదుంప చిప్స్ ను పొరపాటున కూడా తీసుకోకూడదు.వీటిలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు, కేలరీలు నిండి ఉంటాయి.
ఇవి రక్తపోటును పెంచుతాయి.చెడు కొలెస్ట్రాల్, బరువు పెరుగుట( Bad cholesterol, weight gain ) మరియు ఊబకాయానికి దారితీస్తాయి.
ఫలితంగా గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతంది.మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం.
కాబట్టి, ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంప చిప్స్ మరియు పెద్ద మొత్తంలో కొవ్వులను ఉపయోగించే ఇతర బంగాళాదుంప వంటకాలకు దూరంగా ఉండండి.