రోజుకు ప‌ది న‌ల్ల ఎండు ద్రాక్ష తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఎండు ద్రాక్ష( Raisins )లో మనకు చాలా రకాలు ఉన్నాయి.అందులో నల్ల ఎండు ద్రాక్ష కూడా ఒకటి.

 Do You Know What Happens If You Eat Ten Black Raisins A Day? Black Raisins, Blac-TeluguStop.com

అయితే నల్ల ఎండు ద్రాక్షను చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు.వాటిని పెద్దగా తినేందుకు ఇష్టపడరు.

కానీ నల్ల ఎండు ద్రాక్ష మన ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది.న‌ల్ల ఎండు ద్రాక్ష‌లో జింక్, ఫాస్పరస్, ఐర‌న్‌, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి మిన‌ర‌ల్స్, రిబోఫ్లావిన్, థయామిన్ వంటి విట‌మిన్స్, డైటరీ ఫైబర్, ప్రోటీన్ తో స‌హా అనేక పోష‌కాలు నిండి ఉంటాయి.

ప‌ది చొప్పున‌ ఎండు ద్రాక్ష‌ల‌ను వాట‌ర్ లో వేసి నైట్ అంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవాలి.నీటిలో నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు రెట్టింపు అవుతాయి మరియు బోలెడు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

Telugu Black Raisins, Blackraisins, Tips, Latest-Telugu Health

ముఖ్యంగా నల్ల ఎండుద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది.ఇది ప్రేగులను క్రమబద్ధీకరించడానికి మరియు మలబద్ధకాన్ని నివారించ‌డానికి అద్భుతంగా తోడ్ప‌డుతుంది.అదే స‌మ‌యంలో జీర్ణ‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తుంది.అలాగే నల్ల ఎండుద్రాక్షలో మెండుగా ఉండే పొటాషియం రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.న‌ల్ల ఎండుద్రాక్ష‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రుస్తాయి.వాపును త‌గ్గిస్తాయి.

Telugu Black Raisins, Blackraisins, Tips, Latest-Telugu Health

ఏజ్ పెరిగినా మీ బోన్స్ స్ట్రోంగ్ గా ఉండాలంటే మీరు నిత్యం న‌ల్ల ఎండు ద్రాక్ష తినాల్సిందే.ఎందుకంటే, నల్ల ఎండుద్రాక్షలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది బలమైన ఎముకలను నిర్వహించడానికి సహాయపడుతుంది.అలాగే నల్ల ఎండు ద్రాక్ష‌లో అధిక మొత్తంలో ఐర‌న్ కంటెంట్ ఉంది.ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మరియు ఆక్సిజన్ రవాణాలో ఇది కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది.

అంతేకాదండోయ్ నిత్యం ప‌ది చొప్పున న‌ల్ల ఎండు ద్రాక్ష‌ను తింటే.అందులో ఉండే విట‌మిన్స్ మ‌రియు యాంటీ ఆక్సిడెంట్స్ అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంలో హెల్ప్ చేస్తాయి.

చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరిపిస్తాయి.జుట్టు రాల‌డాన్ని అడ్డుకుంటున్నాయి.

ఆరోగ్యకరమైన, దృఢ‌మైన‌ జుట్టును ప్రోత్స‌హిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తి( Immunity )ని పెంచుతాయి.

పైగా ప్ర‌తి రోజూ న‌ల్ల ఎండు ద్రాక్ష‌ను తింటే నిద్ర నాణ్య‌త కూడా అద్భుతంగా పెరుగుతుంది.గుండె మంట, ఛాతీ మంట, నోటి పూత వంటి స‌మస్య‌లు ప‌రార్ అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube