దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో( New Delhi Railway Station ) శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.అనూహ్య రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో( Stampede ) 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.అయితే, మృతుల వివరాలపై రైల్వేశాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
అయితే ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఘటన ఎలా జరిగిందన్న విషయానికి వస్తే… ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా( Maha Kumbh Mela ) కారణంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది.మహా కుంభమేళాకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య తక్కువ కాకపోవడంతో ఒక్కసారిగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రద్దీ పెరిగింది.14వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్( Prayagraj Express ) నిలిచి ఉండగా, అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆలస్యమవడంతో ప్రయాణికులు 12, 13, 14 నంబర్ ప్లాట్‌ఫాంలపై భారీ సంఖ్యలో గుమిగూడారు.ఒక్కసారిగా తొక్కిసలాట ప్రారంభమై తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఈ దారుణమైన ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ధ్రువీకరించారు.ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రద్దీని తగ్గించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.దీంతో ప్రయాగ్ రాజ్‌కు వెళ్లే రహదారులు, రైల్వే స్టేషన్లు, విమాన సర్వీసులు రద్దీగా మారాయి.
రైళ్ల ఆలస్యంపై కాసేపటికి మరికొన్ని రైళ్లు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా గుమిగూడడం తొక్కిసలాటకు దారితీసింది.

ప్రస్తుతం అక్కడి పరిస్థితి వివరాలు చుస్తే 18 మంది మృతి చెందారు.పదుల సంఖ్యలో గాయపడినవారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.మరొకవైపు రైల్వే శాఖ విచారణకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి రద్దీని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఘటన భయానకమైనదిగా మారింది.
రైల్వే అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు రైల్వే శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.