ఇప్పటివరకు పాన్ ఇండియాలో తెలుగు సినిమాలు( Telugu Movies ) సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాయి.కానీ ఇకమీదట కూడా మనవాళ్లు భారీ విజయాలను అందుకోవాలంటే మన స్టార్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ( Fauji ) అనే సినిమా చేస్తున్నాడు.కాబట్టి ప్రభాస్( Prabhas ) పాన్ ఇండియాలో తన సత్తా ఏ మేరకు చాటుకుంటాడు.
తద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక 2025 వ సంవత్సరంలో వస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియాని( Pan India ) షేక్ చేసే సినిమా అయితే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇక మరో 10 సంవత్సరాల వరకు అడ్డంకి చెప్పే వారే ఉండరు.అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవడమే కాకుండా పదిలంగా 10 సంవత్సరాల పాటు కాపాడుకున్నది కూడా అవుతుంది.అందువల్ల 2025 వ సంవత్సరం పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ లను కొట్టడం అనేది చాలా కీలకమైన విషయమనే చెప్పాలి… ఇక ఇప్పటివరకు పాన్ ఇండియాలో సినిమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న వారే కావడం విశేషం…

మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట మన సినిమాలు భారీ విజయాలను సాధిస్తే మాత్రం మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.లేకపోతే మాత్రం మరోసారి బాలీవుడ్ హీరోలు( Bollywood Heroes ) మన తెలుగు సినిమాలను డామినేట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి.చూడాలి మరి ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ తన సత్తాను చాటుకుంటుందా తద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే పోటీని తిప్పి కొట్టి మనల్ని మన సినిమాలని నెంబర్ వన్ పొజిషన్ లో నిలుపుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.