సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025( CCL 2025 ) లో తెలుగు వారియర్స్ మరో ఓటమిని చవిచూసింది.హైదరాబాద్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై రైనోస్( Chennai Rhinos ) అద్భుత ప్రదర్శనతో తెలుగు వారియర్స్‌ను( Telugu Warriors ) మట్టికరిపించింది.
అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.రూల్స్ తెలియకనో, లేక పొరపాటునో తెలీదు కానీ.
తెలుగు వారియర్స్ జట్టు గ్రౌండ్‌లో 12 మంది ఫీల్డింగ్‌కు దిగింది.మొదట ఇది గమనించని చెన్నై, ఆ తర్వాత విషయం తెలుసుకుని మ్యాచ్‌ను అడ్డుకుంది.
చెన్నై కెప్టెన్ అంపైర్లను ఆశ్రయించడంతో గ్రౌండ్‌లో రచ్చరచ్చ జరిగింది.తెలుగు వారియర్స్ తమ వాదనను కొనసాగించినా, అంపైర్లు లెక్క తేల్చిన తర్వాత నిజం బయటపడింది.
ఈ సంఘటన 9వ ఓవర్ సమయంలో చోటుచేసుకుంది.
ఈ తతంగం కారణంగా దాదాపు 15 నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది.అయినా, గొడవ సద్దుమణిగిన తర్వాత మ్యాచ్ మళ్లీ కొనసాగింది.అయితే చివరికి చెన్నై 25 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.
రెండు ఓటములతో తెలుగు వారియర్స్ కష్టాల్లో పడింది.మొదటి మ్యాచ్‌లో కర్ణాటక చేతిలో ఓడిన ఈ జట్టు, ఇప్పుడు చెన్నై చేతిలోనూ ఓడిపోయింది.
మరోవైపు చెన్నై మొదటి విజయం అందుకుంది.మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే .చెన్నై బ్యాటింగ్ లో భాగంగా 3 వికెట్లు కోల్పోయిన చెన్నై 125 పరుగులు చేసింది.ఇందులో విక్రాంత్ 61, దశరథి 35 పరుగులు చేసి రాణించారు.
తెలుగు వారియర్స్ బౌలర్ రఘు( Raghu ) 2 వికెట్లు తీశాడు.తెలుగు వారియర్స్ బ్యాటింగ్ లో 6 వికెట్లకు 105 పరుగులే చేయగలిగింది.
రోషన్( Roshan ) 33 బంతుల్లో 72 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు.చెన్నై బౌలర్ చరణ్ 3 వికెట్లు పడగొట్టాడు.
రెండవ ఇన్నింగ్స్ లో భాగంగా చెన్నై 87 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది.ఛేజింగ్‌లో తెలుగు వారియర్స్ 89 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.దీంతో తెలుగు వారియర్స్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఈ మ్యాచ్‌తో టీమ్‌లోని తప్పిదాలు స్పష్టంగా కనిపించాయి.ఇక ముందు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలని తెలుగు వారియర్స్ అభిమానులు ఆశిస్తున్నారు.