ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలలో పులిపిర్లు కనిపిస్తూ ఉంటాయి.అయితే ఇది ఒక సాధారణ సమస్య అని చెప్పాలి.
అయితే చాలామంది అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా చేతులపై, కాళ్లపై పులిపిర్లు కనిపిస్తే పట్టించుకోరు కానీ ముఖంపై కనిపిస్తే మాత్రం వాటిని గిల్లుతూ ఉంటారు.ఇక వాటిని ఎలాగైనా తొలగించుకోవాలని అనుకుంటూ ఉంటారు.
దానికి సంబంధించి ఎన్నో ఇంటి చిట్కాలను మందులను వాడడానికి సిద్ధపడతారు.
ఇక ఎక్కువ మందికి తెలియని విషయం ఏమంటే పులిపిర్లు వచ్చేది కూడా ఒక వైరస్ వల్లనే అయితే ఆ వైరస్ వల్ల వచ్చే ఒక చర్మం ఇన్ఫెక్షన్ పులిపిర్లను వచ్చేలా చేస్తుంది.
అయితే ఈ వైరస్ పేరు హ్యూమన్ పాపిలోమా.అయితే ఇది చర్మం మీద దెబ్బలు లేదా మొటిమలు వచ్చినప్పుడు ఆ సందులలో నుంచి చర్మం లోకి ప్రవేశిస్తుంది.
అదనపు కణాలు ఒకే చోట పెరిగేలా చేసి ఆ కణాలని చర్మం వెలుపలకు పెరిగి గట్టిపడేలా చేస్తుంది.ఇక అవి పులిపిర్లుగా మారిపోతాయి.వీటిని ఆంగ్లంలో వాట్స్ అని పిలుస్తారు.అయితే వీటిని ఎలా తొలగించుకోవాలో తెలియక చాలామంది చేత్తో గిల్లుతూ ఉంటారు.
అయితే అలా గిల్లడం వల్ల సమస్య పెరుగుతుంది కానీ తగ్గడం సాధ్యం.అందుకే పులిపిర్లను తొలగించుకోవాలంటే డర్మటాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది.
వాళ్లు దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ తో కత్తిరిస్తారు.ఇక కొన్ని పులిపిర్లు కాయలు కాకుండా బలపరుపుగా ఉంటాయి.

అయితే ఇలాంటి వాటిని మాత్రం క్రయోథెరపీ చికిత్స చేయాల్సి ఉంటుంది.అయితే ఈ చికిత్సలో భాగంగా లోపల ఉన్న వైరస్ ను చంపేస్తారు.దాన్ని మైనస్ 67 డిగ్రీ పంపించి ఆ వైరస్ ని గడ్డ కట్టేలా చేస్తారు.దీంతో వైరస్ చనిపోతుంది.వైరస్ చనిపోయాక ఆ ప్రాంతంలో చర్మం పై పొరతో సహా ఆ వైరస్ ను తీసి పాడవేస్తారు.ఇక వైరస్ పొరపాటున గొంతులోకి చేరిందంటే మాత్రం గొంతులో కూడా పులిపిర్లు వచ్చేస్తాయి.
అందుకే చికిత్స చేస్తున్న సమయంలో ముక్కు ద్వారా వైరస్ చేరకుండా వైద్యులు చూసుకుంటారు.ఇక మళ్ళీ ఆ వైరస్ పెరగకుండా వాటిని పోరాడేందుకు కొన్ని రకాల మందులు కూడా వాడమని వైద్యులు సూచిస్తారు.
ఈ మందులు వాడడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.దీంతో వైరస్ దరి చేరదు.







