Cumin : ఉదయాన్నే నానబెట్టిన జీలకర్ర తీసుకుంటే ఆశ్చర్యపరిచే లాభాలు..!

ప్రతి వంటింట్లో సాధారణంగా కనిపించే సుగంధద్రవ్యాలలో జీలకర్ర( Cumin ) కూడా ఒకటి.దీన్ని రుచిని పెంచేందుకు వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటారు.

 Amazing Health Benefits Of Soaked Cumin-TeluguStop.com

అయితే శతాబ్దాల నుండి ఈ మసాలాలలో రుచితో పాటు మరెన్నో ఔషధ లక్షణాలు కూడా దాగి ఉన్నాయి.జీలకర్ర దాని ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఎన్నో సంప్రదాయ ఔషధాలలో ఉపయోగిస్తున్నారు.

అంతేకాకుండా ఉదయాన్నే పరగడుపున నానబెట్టి జీలకర్ర నీరు తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు అని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీలకర్రలో సహజంగా విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ కె లాంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Telugu Cumin, Tips, Jeera, Soaked Cumin-Telugu Health

ఇవి రోగనిరోధక శక్తిని జీవిక్రియను పెంచడంలో సహాయపడతాయి.అంతేకాకుండా ఈ మసాలాలో ఇనుము లాంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.అంతేకాకుండా ఇది శరీరంలో ఆక్సిజన్( Oxygen ) సరఫరాకు సహాయపడడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే జీలకర్ర బరువు నిర్వహణపై సానుకూల ప్రభావాన్ని కూడా చూపిస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.అంతేకాకుండా ఇది జీవక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.తరచూ జీలకర్ర నీటిని తాగడం వలన రక్త ప్రసరణ( Blood Circulation ) కూడా మెరుగుపడుతుంది.

Telugu Cumin, Tips, Jeera, Soaked Cumin-Telugu Health

జీలకర్రలో అధిక ఫైబర్ కంటెంట్ అలాగే పోషకాలు ఉండటం వలన ఇది రక్తప్రసరణకు సహాయపడుతుంది.ఇది సహజంగా ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.జీలకర్ర జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని వేగవంతం చేసే సమ్మేళనాలను కలిగి ఉంటుంది.

అలాగే మెరుగైన జీర్ణ క్రియతో పాటు పోషకాలను గ్రహించడంలో కూడా ఉపయోగపడుతుంది.ఇక ఉదయాన్నే నానబెట్టిన జీలకర్రను తింటే జీర్ణ వ్యవస్థ( Digestion ) రోజంతా మెరుగ్గా ఉంటుంది.

ఇక జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉండడం వలన ఇది శరీరాన్ని డిటాక్సి ఫై చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.అలాగే శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను దూరం చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube