న్యూస్ రౌండప్ టాప్ 20

1.భారీగా ఫేక్ కరెన్సీ పట్టివేత

రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవ్ పల్లి లో భారీగా ఫేక్ కరెన్సీ బయటపడింది.ఫేక్ కరెన్సీ తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

2.మెడికల్ కాలేజీల వ్యవహారంపై హరీష్ రావు కామెంట్స్

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Apcm, Cm Kcr, Corona, Kcr National, Kodali Nani, Rahul Gandhi, Sharannava

దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన కేంద్రం తెలంగాణకు ఒకటి కూడా మంజూరు చేయలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. 

3.ఏపీ రైతులకు అలెర్ట్

  పంటల భీమా , ఇతర పథకాలకు అర్హత కోసం రైతుల తప్పనిసరిగా ఈనెల 12వ తేదీలోపు ఈ కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరి కిరణ్ తెలిపారు. 

4.ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kcr National, Kodali Nani, Rahul Gandhi, Sharannava

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 

5.మెడికల్ కోర్స్ పంపిణీ

  పాఠశాల స్థాయిలో 6,7,8,9, 10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం కోటా డిజిటల్ మీడియా రూపొందించిన ఐఐటీ, మెడికల్ స్టడీ మెటీరియల్ అసైన్మెంట్స్ ,( డిజిటల్ ); అందిస్తున్నామని ఐఐటి జేఈఈ నీట్ ఫోరం తెలిపింది. 

6.బీఆర్ ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kcr National, Kodali Nani, Rahul Gandhi, Sharannava

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల విమర్శలు చేశారు కేసీఆర్ పెట్టబోతున్న జాతీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. 

7.ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ బి.ఎన్ రావు

  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లికి చెందిన డాక్టర్ బండారి నరేందర్ రావు ఎన్నికయ్యారు. 

8.రేపే కెసిఆర్ జాతీయ పార్టీ

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kcr National, Kodali Nani, Rahul Gandhi, Sharannava

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని రేపు ప్రకటించనున్నారు.ఈ మేరకు టిఆర్ఎస్ పార్టీ పేరును టిఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేయనున్నారు. 

9.ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సర్వే పూర్తి

 కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి హక్కు పత్రాలు అందించే క్రమంలో గత నెల 20న ప్రారంభించిన ఇంటింటా సర్వే పూర్తయినట్టు ఆర్డీవో సూర్యనారాయణ తెలిపారు. 

10.కెసిఆర్ విమానం కొనుగోలు పై షర్మిల కామెంట్స్

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kcr National, Kodali Nani, Rahul Gandhi, Sharannava

తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతికి కాలేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని ఇప్పుడు దేశాలు ఏలడానికి విమానాలు కొంటున్నారని షర్మిల కామెంట్ చేశారు. 

11.సద్దుల బతుకమ్మ వేడుకలు

  ఎల్బీ స్టేడియం లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు . 

12.ప్రధాని హైదరాబాద్ టూర్

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kcr National, Kodali Nani, Rahul Gandhi, Sharannava

ప్రధాని నరేంద్ర మోడీ  11వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు.యుయెన్ డబ్ల్యూ జీఐసీ సదస్సులో ప్రధాని ప్రసంగించనున్నారు. 

13.కెసిఆర్ పై కిషన్ రెడ్డి కామెంట్స్

  ఎంఐఎం బలోపేతానికి కెసిఆర్ కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు  

14.తెలంగాణ భవన్ లో హైదరాబాద్ నేతల భేటీ

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kcr National, Kodali Nani, Rahul Gandhi, Sharannava

తెలంగాణ భవన్ లో హైదరాబాద్ జిల్లా నేతలు సోమవారం సమావేశం అయ్యారు.మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలీ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. 

15.ఏపీలో రాహుల్ పాదయాత్ర

  రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జూడో యాత్ర తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో పూర్తయిందని ఈనెల 18న ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ తెలిపారు. 

16.దుర్గమ్మను దర్శించుకున్న కొడాలి నాని

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kcr National, Kodali Nani, Rahul Gandhi, Sharannava

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని దర్శించుకున్నారు. 

17.శ్రీకాకుళంలో రజకుల గ్రామ బహిష్కరణ

  శ్రీకాకుళం జిల్లాలోని వాకడ మండలం బాతువలో రజకులు గ్రామ బహిష్కరణకు గురయ్యారు.గత కొంతకాలంగా గ్రామంలో బట్టలు ఉతకడానికి రజకులు నిలిపివేయడంతో గ్రామ పెద్దలు వారిని గ్రామం నుంచి బహిష్కరించారు. 

18.పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kcr National, Kodali Nani, Rahul Gandhi, Sharannava

ఏలూరు జిల్లాలో తాడేపల్లిగూడెంలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసిపి నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గొడవ నుంచి తాడేపల్లిగూడెం టౌన్ వరకు ఫ్లెక్సీలు వెలిశాయి. 

19.నేడు తిరుమల శ్రీవారి రథోత్సవం

 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి .రాత్రి 7 గంటలకు కోనేటి రాయుడు ఊరేగనున్నారు. 

20.ఈరోజు బంగారం ధరలు

 

Telugu Apcm, Cm Kcr, Corona, Kcr National, Kodali Nani, Rahul Gandhi, Sharannava

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,350
  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,660

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube