సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం జిల్లాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో బాధిత రైతు మాట్లాడుతూ తన తాతముత్తాతల దగ్గర నుండి వస్తున్న వారసత్వ భూమిని,తనకు డిజిటల్ పట్టా కూడా ఉన్నా కొందరు అక్రమంగా,అన్యాయంగా దౌర్జన్యం చేస్తూ అక్రమిస్తున్నారని,తనకు ఇద్దరు అడపిల్లలని, అధికారులు తనకు న్యాయం చేయాలని దీనంగా వేడుకోవడం ఆలోచింపజేస్తుంది.







